చాలా సన్నబడినట్లున్నావ్!: మహిళా నేత చెయ్యి పట్టుకుని కాంగ్రెస్ నేత అసభ్య కామెంట్స్
చేయి పట్టుకుని నలిపేయడమే కాదు.. 'ఈమధ్య చాలా సన్నబడ్డట్లున్నావు.. బరువు తగ్గిపోయావు' అంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.
బెంగళూరు: అదో బహిరంగ సభ అన్న విషయం కూడా మరిచిపోయిన ఓ కాంగ్రెస్ నాయకుడు మహిళా నాయకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సభా వేదికపై ఆయన పక్కన కూర్చున్న మహిళా నాయకురాలి చేయి పట్టుకుని నలిపాడు. బలవంతంగా ఆమె ఆయన చేయిని పక్కకు నెట్టేయడం సీసీటీవి కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది.
చేయి పట్టుకుని నలిపేయడమే కాదు.. 'ఈమధ్య చాలా సన్నబడ్డట్లున్నావు.. బరువు తగ్గిపోయావు' అంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. కర్ణాటక కాంగ్రెస్ టీపీ రమేష్ వెలగబెట్టిన నిర్వాకమిది. ఆయన నిర్వాకానికి హతాశయురాలైన వీణా ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. దీనిపై మీడియా వివరణ కోరడంతో ఆమె స్పందించారు.

రమేష్ అలా చేయడంతో తాను షాక్ తిన్నానని, కానీ కార్యక్రమంలో వివాదాన్ని సృష్టించడం ఇష్టం లేక ఆయన చెయ్యిని వదిలించుకునే ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చారు. ధర్మశాలలో కొద్దిరోజుల క్రితం హెల్త్ క్యాంప్ నిర్వహించిన విషయంపై ఇద్దరు చర్చించుకుంటున్న సమయంలో.. ఆయన ఒక్కసారిగా తన చెయ్యి పట్టుకోవడం ఇబ్బందిగా అనిపించిందన్నారు.
అయితే సభానంతరం ఇంటికెళ్లాక.. రమేష్ తనకు ఫోన్ ద్వారా క్షమాపణలు చెప్పినట్లు వీణా తెలిపారు. తన సోదరిలా భావించే చెయ్యి పట్టుకున్నానే తప్పించి వేరే దురుద్దేశమేమి లేదని ఆమె వివరణ ఇచ్చింది. రమేష్ కూడా మీడియాతో ఇదే విషయం చెప్పడంతో వివాదానికి తెరపడింది. ఈ వివాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.












Click it and Unblock the Notifications