సీబీఐకి కొత్త బాస్ - కర్ణాటక ఎఫెక్ట్, మోదీ మార్క్ ఎంపిక..!!
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి కొత్త బాస్ ఎంపికయ్యారు. ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్ గా ఉన్న సుబోధ్ కుమార్ జైశ్వాల్ రెండేళ్ల పదవీ కాలం మే 25తో ముగుస్తుంది. ఆయన స్థానంలో కొత్తగా ప్రస్తుత కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న సమయంలో ఆ రాష్ట్ర డీజీపీకి సీబీఐ డెరెక్టర్ గా అవకాశం దక్కింది. ఈ పదవిలో సూద్ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త సీబీఐ డైరెక్టర్ ఎంపిక కోసం కమిటీ శనివారం సమావేశం నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, లోక్‌సభ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరితో కూడిన ఉన్నతస్థాయి కమిటీ పలువురు పేర్లను పరిశీలించి, చివరకు ముగ్గుర్ని షార్ట్‌లిస్ట్ చేసినట్లు సమాచారం. ఆ ముగ్గురిలో కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్, మధ్యప్రదేశ్ డీజీపీ సుధీర్ సక్సేనాతో పాటు ఐపీఎస్ అధికారి తాజ్ హాసన్‌ల పేర్లు ఉన్నాయని తెలిసింది. ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్ గా ఉన్న సుబోధ్ కుమార్ జైశ్వాల్ రెండేళ్ల పదవీకాలం మే 25తో ముగియనుంది. దీంతో, ఇప్పుడు ఆ స్థానంలో తాజా నియామకం జరిగింది.

ముగ్గురు అధికారుల పేర్లు జాబితాలో ఉన్న కర్ణాటక డీజీపీ సూద్ పేరు వైపే మొగ్గు చూపారు. తాజాగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. అక్కడ కాంగ్రెస్ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. డీజీపీ సూద్ పైన కాంగ్రెస్ నేతలు పలు సందర్భాల్లో విమర్శలు చేసారు. డీజీపీ పైన కాంగ్రెస్ నేత డీకే శివ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ నేతలపై కేసులు పెడుతున్నారని, బీజేపీని కాపాడుతున్నారని, ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి రావటంతో ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆ సమయంలో డీజీపీని మారుస్తారనే చర్చ ఉంది.
ఇప్పుడు సీబీఐ డైరెక్టర్ గా అనూహ్యంగా 1986 కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. సూద్ గతంలో బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ గానూ పని చేసారు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సూద్ కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారికగా ఎంపికయ్యారు. మూడేళ్ల పాటు మారిషన్ లో పోలీసు సలహాదారుగా పని చేసారు. ప్రస్తుతం రెండేళ్ల కాలపరిమితితో సూద్ నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ తరువాత ప్రత్యేక అనుమతితో పొడిగించే అవకాశం ఉంటుంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications