నైట్‌ షో: ఎందుకు అడ్డుకొంటున్నారు, సన్నీలియోన్ స్టేట్‌మెంట్ తీసుకోండి: కోర్టు

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: కర్ణాటకలో సన్నీలియోన్ నైట్‌షో పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సన్నీలియోను షో‌ను ఎందుకు అడ్డుకొంటున్నారని కర్ణాటక హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది.

సన్నీలియోన్ నైట్‌షో‌పై కర్ణాటక పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. అయితే ఈ విషయమై పోలీసులను హైకోర్టు పోలీసులను ఆసక్తికర ప్రశ్నలు వేసింది.సన్నీలియోన్ నైట్‌షో ను భద్రతా కారణాలను చూపి పోలీసులు అడ్డు చెబుతున్నారు.

హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

సన్నీలియోన్ నైట్‌షో నిర్వహణపై కర్ణాటక ప్రభుత్వం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎందుకు ఈ నైట్ షోకు అనుమతి ఇవ్వడం లేదని కర్ణాటక హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించడంతో పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు.

పోలీసులు చెబుతున్న కారణాలు లేవు

పోలీసులు చెబుతున్న కారణాలు లేవు

భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ పోలీసులు అనుమతి నిరాకరించటంతో షో నిర్వాహకులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న 18 రోజుల తర్వాత నిరాకరిస్తున్నట్లు చెప్పటం అది కూడ భద్రతా కారణాలను చెప్పడం సహేతుకంగా లేవని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో పోలీసులను పలు ప్రశ్నలు వేసింది కోర్టు.

సన్నీలియో‌న్ స్టేట్‌మెంట్ రికార్డు

సన్నీలియో‌న్ స్టేట్‌మెంట్ రికార్డు

కొత్త సంవత్సరం వేడుకల విషయంలో మిగతా క్లబ్‌ ఈవెంట్లపై లేని అభ్యంతరాలు కేవలం సన్నీలియోన్‌ షోపై మాత్రమే ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించింది.ఈ విషయంలో సన్నీ లియోన్‌ నుంచి స్పష్టమైన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని.. డిసెంబర్‌ 31న నగరంలో ఎవరెవరికి అనుమతులు ఇచ్చారో జాబితా ను అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలని న్యాయమూర్తి బీ వీరప్ప ఆదేశించారు.

సన్నీలియోన్ ఈవెంట్ కోసం రూ.2.5కోట్లు

సన్నీలియోన్ ఈవెంట్ కోసం రూ.2.5కోట్లు

ఈవెంట్‌ ఏర్పాట్ల కోసం సుమారు 2.5 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న సమయంలో నాలుగైదు రోజుల్లో అనుమతులు ఇస్తామని పోలీస్‌ శాఖ చెప్పిందని.. ఇప్పుడు అభ్యంతరాల నేపథ్యంలో షో రద్దైతే తనకు భారీగా నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karnataka High Court question the Bengaluru city police as to why they were discriminating against Sunny Leone, while letting other New Year shows go on.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి