బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా మాటలు అర్థం చేసుకోలేదు: బెంగళూరు షాకింగ్ వీడియోపై హోంమంత్రి

కర్నాటక రాజధాని బెంగళూరులో డిసెంబర్ 31వ తేదీన రాత్రి జరిగిన ఘటన పైన హోంమంత్రి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో డిసెంబర్ 31వ తేదీన రాత్రి జరిగిన ఘటన కలకలం రేపుతోంది. దీని పైన హోంమంత్రి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.

ఆ దుర్ఘటన పైన తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పరమేశ్వర అన్నారు. మహిళలపై జరిగిన దుశ్చర్యల నేపథ్యంలో తాను చెప్పిన మాటలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోవడం లేదని, సందర్భానికి విరుద్ధంగా వివరించి చెప్తున్నారన్నారు.

బెంగళూరులో యువతిని వేధించిన షాకింగ్ వీడియో: ఒకడు ఎవరంటే..

పాశ్చాత్య సంస్కృతికి యువత అలవాటు పడుతుండటం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని పరమేవ్వర వ్యాఖ్యానించారని మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ సంఘటనపై స్పందించాలని తన మిత్రుడు కోరారని, దానికి తాను మాట్లాడుతూ న్యూ ఇయర్స్ డే సందర్భంగా సంబరాలు ప్రతిసారీ జరుగుతూ ఉంటాయని తాను అన్నట్లు చెప్పారు. దుశ్చర్యలు, వేధింపుల గురించి తాను మాట్లాడలేదన్నారు.

Karnataka Home Minister says his remarks misinterpreted.

బెంగళూరు నగరంలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఐటీ హబ్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. రాబోయే రెండు నెలల్లో నగర వ్యాప్తంగా 550 కొత్త సీసీటీవీ కెమెరాలను అమర్చుతామన్నారు.

అమ్మాయిని లాగి..: బెంగళూరు షాకింగ్‌లో 12మంది అరెస్ట్, తప్పు చేశామని..

డయల్ 100 హెల్ప్‌లైన్లను 15 నుంచి100కు పెంచుతామన్నారు. కొత్తగా మహిళా పోలీసు అధికారులను, కానిస్టేబుళ్ళను నియమిస్తామన్నారు. సంఘటన జరిగినప్పటి నుంచి పోలీసులు సీసీటీవీ ఫుటేజిలను పరిశీలిస్తున్నారన్నారు.

అవాంఛనీయ సంఘటనలను చిత్రీకరించిన వీడియో పుటేజిలను ఇచ్చేందుకు ముందుకు రావాలని మీడియాను కోరారు. బెంగళూరులో మహిళలు ప్రశాంతంగా జీవించవచ్చునన్నారు. న్యూ ఇయర్స్ డే సందర్భంగా జరిగిన సంఘటన వల్ల నగరానికి చెడ్డ పేరు రాకూడదని తెలిపారు.

English summary
Karnataka Home Minister says his remarks misinterpreted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X