బీజేపీ షాక్ ఇస్తున్న బళ్లారి బ్రదర్స్ అనుచర ఎమ్మెల్యేలు, దెబ్బకు దెబ్బ, కాంగ్రెస్!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అనుచర ఎమ్మెల్యేలు బీజేపీకి గట్టి షాక్ ఇస్తున్నారు. మమ్మల్ని నిర్లక్షం చేసే వేరే నాయకులను పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తే తాము చూస్తూ సహించమని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు.

ఆనంద్ సింగ్ ఝలక్

ఆనంద్ సింగ్ ఝలక్

బీజేపీకి తాజాగా ఆ పార్టీ హోస్ పేట్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ఝలక్ ఇచ్చారు. హోస్ పేట్ బీజేపీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ త్వరలోనే ఆ పార్టీకి గుడ్ బాయ్ చెబుతారని వార్తలు గుప్పుమన్నాయి. ఆనంద్ సింగ్ ను కాదని మరో వ్యక్తికి బీజేపీ నాయకులు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం.

గాలితో పాటు జైలుకు

గాలితో పాటు జైలుకు

గత 10 ఏళ్ల నుంచి హోస్ పేట్ శాసన సభ్యుడిగా ఉన్న ఆనంద్ సింగ్ మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆనంద్ సింగ్ జైలుకు వెళ్లి వచ్చారు.

మంత్రిగా పని చేసిన సింగ్

మంత్రిగా పని చేసిన సింగ్


బళ్లారి రెడ్డి బ్రదర్స్ ఆశీర్వాదంతోనే రెండు సార్లు ఆనంద్ సింగ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బళ్లారి ఎంపీ శ్రీరాములు గతంలో బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సమయంలో ఆనంద్ సింగ్ బీజేపీని వదిలి పెట్టకుండా జగదీష్ శెట్టర్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు.

బీజేపీకి టాటా ?

బీజేపీకి టాటా ?

తనను నిర్లక్షం చేస్తున్నారని ఆవేదనతో ఉన్న ఆనంద్ సింగ్ త్వరలో బీజేపీకి టాటా చెప్పాలని చూస్తున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. కుల మతాలకు అతీతంగా ఆనంద్ సింగ్ అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించి హోస్ పేట్ లో మంచి పట్టు సాధించారు.

నిన్న నాగేంద్ర, నేడు ?

నిన్న నాగేంద్ర, నేడు ?


ఇప్పటికే కూడ్లగి శాసన సభ్యుడు, బళ్లారి బ్రదర్స్ అనుచరుడు బి. నాగేంద్ర కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దం అయిన నేపథ్యంలో మరో ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ సైతం అదే దారిలో నేను వెలుతానని అంటున్నారని సమాచారం. మొత్తం మీద ఇలాగే ఉంటే బళ్లారి జిల్లాలో బీజేపీకి మంచి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని తెలిసింది

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karnataka Hospet BJP MLA Anand singh join in Congress party?

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి