సీఎం కుర్చీ కోసం 224 మంది క్యూలో ఉన్నారు, ఎన్నెన్నో అనుకుంటాము, అన్నీ జరిగిపోతాయా ?
బెంగళూరు: కర్ణాటకలో సీఎం కుర్చీ మీద ఇప్పుడు చాలా మంది కన్ను పడింది. సీఎం సిద్దరామయ్య సీటుకు ప్రత్యక్షంగా డీకే శివకుమార్ ఎసరుపెట్టిన విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే ఇప్పుడు కర్ణాటకలోని చాలా మంది నాయకులు చాపకింద నీరులా సీఎం కుర్చీ కోసం ఆశపడుతున్నారు. మళ్లీ ఒకసారి దళిత సీఎం ప్రస్తావన తెరమీదకు తెచ్చిన కొందరు మంత్రులు రాజకీయాలు చేస్తున్నారు.
కర్ణాటకలోని 224 మంది ఎమ్మెల్యేలు కూడా సీఎం కావాలనుకుంటున్నారని, మాకు 136 మంది ఎమ్మెల్యేలు ఉండటం కూడా ఒక కారణం అని, అందరి కోరికలు సహజం అని, 136 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ప్రభుత్వానికి అభద్రతా బావం అనే ప్రశ్నే అక్కర్లేదని, ప్రభుత్వం కూడా సురక్షితమని కర్ణాటక మంత్రి కేహెచ్ మునియప్ప అన్నారు.

ఈ విషయమై మంత్రి మునియప్ప మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనదైన చాకచక్యంతో పాలన సాగిస్తున్నారు. మంచి బడ్జెట్ ఇస్తూ మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ సీఎం సిద్ధరామయ్య అనుకూలంగా మంత్రి కేహెచ్ మునియప్ప వత్తాసు పలికారు. కర్ణాటక రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి కేహెచ్ మనియప్ప సమాధానమిచ్చారు.
కర్ణాటకలో ఇప్పుడు సిద్ధరామయ్య సీఎం అని అన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం సురక్షితంగా ఉందని, ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదు, ఇతరుల ప్రశ్నలకు నేను సమాధానం చెప్పను అని అన్నారు.
పేదలకు అన్నం పెట్టే బాధ్యత నాకు అప్పగించి ఆహార పౌరసరఫరాల శాఖ అప్పగించారని, కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం తనకు ఉందని అన్నారు.
తనకు అప్పగించిన బాధ్యత నేను చేస్తున్నానని, సీఎం సీటు కోసం మాట్లాడే నాయకుల ప్రశ్నలకు తాను సాధానాలు చెప్పలేనని మంత్రి మనియప్ప అన్నారు. ఇదే సందర్భంలో ఎలాంటి ఇతర ప్రశ్నలు తనను అడగవద్దని, మంత్రిగా తాను శక్తి వంచనలేకుండా పని చేస్తున్నానని, ప్రజాసేవ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని, అందరూ కలిసి కట్టుగా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని మంత్రి కేహెచ్ మనియప్ప అన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications