మంత్రి నాగరాజ్ "నాగిని డ్యాన్స్".. పేరు సార్థకం..! నెట్టింట్లో వైరల్ (వీడియో)

బెంగళూరు : ఎన్నికల వేళ రాజకీయ నేతలు చిత్రవిచిత్ర వేషాలు వేస్తుంటారు. ఒకరు హెయిర్ సెలూన్ లో గడ్డం తీస్తే.. మరొకరు సైకిల్ టైరులో గాలి నింపుతారు. ఎలక్షన్ల టైములో ఇలాంటి జిమ్మిక్కులకు కొదవ ఉండదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వారు పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. అదే కోవలో కర్ణాటక మంత్రి ఎంటీబీ నాగరాజ్ చేసిన నాగిని డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

Karnataka Minister MTB Nagaraj performs Nagin dance video goes viral

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కర్ణాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి ఫుల్ జోష్ తో సందడి చేశారు. దాదాపు 10 నిమిషాల పాటు తన పార్టీ కార్యకర్తలతో నాగిని డ్యాన్స్ చేశారు. బెంగళూరు రూరల్ జిల్లా పరిధిలోని హోస్కోటేలో మంత్రి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చిక్ బళ్లాపూర్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి ఎంపీగా పోటీచేస్తున్న మాజీ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీకి మద్దతుగా ఈ కార్యక్రమం తలపెట్టారు.

వీరి ర్యాలీ కటిగెనహళ్లి గ్రామానికి చేరుకోగానే నాగిని పాట ప్లే చేయించారు. దాంతో ఆ పాటకు అనుగుణంగా మంత్రి స్టెప్పులేశారు. ఆయనకు తోడుగా కార్యకర్తలు కాలు కదిపారు. మంత్రి పేరు నాగరాజ్ కావడం.. ఆయన పేరుకు తగ్గట్టుగా నాగిని డ్యాన్స్ చేయడం.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+