Inspector: కాలేజ్ అమ్మాయిని రేప్ చేసిన సీఐ, అయ్యగారికి ఎంతమంది భార్యలంటే ? !

బెంగళూరు/ చిత్రదుర్గ: సర్కిల్ ఇన్స్ పెక్టర్ (సీఐ)గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఎస్ఐలు, పోలీసుల దగ్గర బిల్డప్ చూపిస్తున్నాడు. సింగం సినిమాలో హీరో సూర్యా మీసాలు స్టైల్ గా పెట్టుకున్నట్లు మీసాలు పెట్టుకున్న సీఐ సామాన్య ప్రజలను బెదిరిస్తూ హీరోలాగా ఫీలైపోతున్నాడు. తన మీద సీఐ పదేపదే అత్యాచారం చేస్తున్నాడని, ఇప్పటికే అనేకసార్లు అబార్షన్ చేయించాడని బీఇడీ పూర్తి చేసిన ఓ యువతి కేసు పెట్టింది. దెబ్బకు సీఐ ఉద్యోగం ఊడిపోయింది. సీఐ తనకు సమీప బంధువు అయిన యువతిని బెదిరించి అత్యాచారం చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది. ఇదే సమయంలో పోటుగాడు సీఐకి ఎంత మంది భార్యలు ఉన్నారు ? అనే విషయం వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

 సర్కిల్ ఇన్స్ పెక్టర్

సర్కిల్ ఇన్స్ పెక్టర్

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని చెళ్లకెరె పోలీస్ స్టేసన్ లో ఉమేష్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ (CI)గా ఉద్యోగం చేస్తున్నాడు. సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగం చేస్తున్న ఉమేష్ సాటి ఎస్ఐలు, పోలీసుల దగ్గర బిల్డప్ చూపిస్తున్నాడు. సింగం సినిమాలో హీరో సూర్యా మీసాలు స్టైల్ గా పెట్టుకున్నట్లు మీసాలు పెట్టుకున్న సీఐ ఉమేష్ అతని పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సామాన్య ప్రజలను బెదిరిస్తూ హీరోలాగా ఫీలైపోతున్నాడు.

 రేప్ కేసు పెట్టిన యువతి

రేప్ కేసు పెట్టిన యువతి

కర్ణాటకలోని దావణగెరెలో ఓ యువతి నివాసం ఉంటున్నది. శివమొగ్గలోని ప్రముఖ ఖాలేజ్ లో ఆమె బీఇడీ పూర్తి చేసింది. ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సంపాధించాలని ఆమె ప్రయత్నాలు చేసింది. తన మీద చెళ్లకెరె పోలీస్ స్టేషన్ సీఐ ఉమేష్ అత్యాచారం చేశాడని దావణగెరెకు చెందిన యువతి కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

 ఇంటి స్థలం వివాదంలో ?

ఇంటి స్థలం వివాదంలో ?

మా తండ్రికి, మరో వయక్తి ఇంటి స్థలం విషయంలో వివాదం ఉందని, ఆ వివాదం పరిష్కరిస్తానని నమ్మించిన సీఐ ఉమేష్ తనను బెదిరించి పదేపదే అత్యాచారం చేశాడని యువతి పోలీసు కేసు పెట్టింది. ఎదురుతిరిగిన తనను చంపేస్తానని, ఇంటి స్థలం మాకు దక్కకుండా చేస్తానని బెదిరించి తన మీద అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపిస్తున్నది.

 ఐదుసార్లు అబార్షన్ చేయించాడు

ఐదుసార్లు అబార్షన్ చేయించాడు

తన మీద సీఐ పదేపదే అత్యాచారం చేసిన సీఐ ఉమేష్ ఇప్పటికే ఐదుసార్లు అబార్షన్ చేయించాడని బీఇడీ పూర్తి చేసిన ఆమె పోలీసు కేసు పెట్టింది. శివమొగ్గలో తాను చదివే సమయంలోనే అక్కడికి వచ్చిన సీఐ ఉమేష్ రివాల్వర్ తో బెదిరించి తన మీద అత్యాచారం చేశాడని, చాలాకాలంగా ఉమేష్ అతని కోరికలు తీర్చుకుంటూ తనను టార్చర్ పెడ్గుతున్నాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది.

 అమ్మాయి సీఐకి బంధువు

అమ్మాయి సీఐకి బంధువు

కేసు విచారణ చెయ్యగా అమ్మాయి మీద సీఐ అత్యాచారం చేసినట్లు వెలుగు చూసిందదని, అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశామని దావణగెరె డివిజన్ ఐజీపీ త్యాగరాజన్ మీడియాకు చెప్పారు. సీఐ ఉమేష్ అతనికి సమీప బంధువు అయిన యువతిని బెదిరించి అత్యాచారం చేశాడని వెలుగు చూడటం కర్ణాటకలో కలకలం రేపింది.

 ఇద్దరు భార్యలు.... మూడో పెళ్లికి సీఐ రెడీ

ఇద్దరు భార్యలు.... మూడో పెళ్లికి సీఐ రెడీ

సీఐ ఉమేష్ కు ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారని పోలీసు అధికారులు అంటున్నారు. సీఐ హోదాలో ఇద్దరు భార్యలతో వేర్వేరుగా కాపురం చేస్తున్న సీఐ ఉమేష్ వరుసకు మామ కూతురు అయ్యే యువతి మీద మోజుపడి మూడో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడని, అందుకు ఎదురు తిరిగిన యువతి మీద అత్యాచారం చేశాడని, బెదిరించి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడని దావణగెరె పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+