హిందీ ప్రయోగం చేస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయి, ఏమనుకుంటున్నారు ?
బెంగళూరు: స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్లలో హిందీ పదాలున్న బ్యానర్ భాగాన్ని మాత్రమే కత్తిరించిన నిరసన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని భాగల్‌కోట్ జిల్లాలో హిందీలో స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చెప్పిన బ్యానర్లను పీస్ పీస్ చేశారు. హిందీతో వేసిన బ్యానర్లను చింపేస్తున్న సమయంలో తీసిన వీడియోలు వైరల్ అయ్యాయి. మారింది.
కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు బాగల్‌కోటేలో హిందీలో రాసిన బ్యానర్లను చింపేసి నిరసనలు వ్యక్తం చేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోలు వైరల్‌గా మారింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ బ్యానర్ చేతబట్టి ప్రజలకు అభివాదం చేశారు. బాగల్‌కోట్‌లో హిందీలో రాసిన బ్యానర్ లు దర్శనం ఇచ్చాయి.

భారీ బ్యానర్‌పై స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, క్రాంతివీర సంగొల్లి రాయన్న జయంతి అని రాశారు. ఇందులో స్వాతంత్ర్య దిన్ అని హిందీలోనూ ముద్రించబడింది. రాయన్న ఫొటోతో పాటు సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే సహా స్థానిక కాంగ్రెస్ నేతల ఫొటోలతో కూడిన బ్యానర్ లు ఏర్పాటు చేశారు.
ఇది గమనించిన కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు స్వాతంత్ర్య దిన్ అనే హిందీ అక్షరాలతో రాసిన భాగాలను కత్తిరించి నిరసన వ్యక్తం చేశారు. హిందీని మా మీద రుద్దడం సరికాదని కరవే కార్యకర్తలు ఆక్షేపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది కామెంట్లు పెట్టారు, కొందరు మిశ్రమ స్పందనలతో కామెంట్లు పెడుతున్నారు.

ఇలాంటి హిందీ ప్రయోగాలు కాంగ్రెస్ నుంచే కాకుండా బీజేపీ నుంచి కూడా జరుగుతున్నాయని, కన్నడిగుల మనోభావాలు దెబ్బ తిస్తే తగిన బుద్ది చెబుతామని కరవే కార్యకర్తలు హెచ్చరించారు. బెంగళూరులో కన్నడలో కూడా లేని బ్యానర్లు ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వాలు, పలు పార్టీల హైకమాండ్ నేతల కోసం తమ కన్నడ భాషను వదులుకునే వారిపై, హిందీ భాషా మా మీద ప్రయోగించడానికి ప్రయత్నించిన వారి గురించి మేము ఆలోచిస్తామని కరవే కార్యకర్తలు హెచ్చరించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications