దేశంలోనే రెండో అతి పెద్ద క్రికెట్ స్టేడియం, క్రికెట్ ఫ్యాన్స్‌కు పూనకాలే..

క్రీడా ప్రేమికులకు, ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరు నగరానికి సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సరికొత్త మెగా స్పోర్ట్స్ హబ్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఆనేకల్ తాలూకాలో రూ. 943 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించ తలపెట్టిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, మల్టీ-డిసిప్లినరీ క్రీడా సముదాయ నిర్మాణ పనులకు శనివారం (మే 24, 2026) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధికారికంగా శంకుస్థాపన చేశారు. ఏకంగా 80,000 మంది కూర్చునే అద్భుతమైన సీటింగ్ సామర్థ్యంతో ఈ స్టేడియం రూపుదిద్దుకోబోతోంది. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం (1,32,000 సీట్లు) తర్వాత, దేశంలోనే రెండో అతిపెద్ద క్రీడా వేదికగా ఇది సరికొత్త రికార్డు సృష్టించనుంది.

కర్ణాటక హౌసింగ్ బోర్డు (KHB) అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు 75 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ మెగా ప్రాజెక్టును చేపడుతోంది. బెంగళూరు సిటీ సెంటర్ నుండి కేవలం 24 కిలోమీటర్ల దూరంలో, ప్రసిద్ధ బన్నెరఘట్ట నేషనల్ పార్క్ సమీపంలోని ఇండ్లవాడి గ్రామంలో ఈ క్రీడా సముదాయం నిర్మాణమవబోతోంది. గత కొన్ని దశాబ్దాల కాలంలో బెంగళూరు నగర పరిధిలో చేపట్టిన అతిపెద్ద స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్యాకేజీగా ఈ ప్రాజెక్ట్ నిలుస్తుందని నిపుణులు అభివర్ణిస్తున్నారు. సిటీకి కాస్త దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో, గ్లోబల్ స్టాండర్డ్స్‌తో ఈ క్రీడా వేదికను ప్లాన్ చేశారు.

Karnataka Starts Rs 943 Crore International Cricket Stadium Near Bengaluru With 80 000 Seating Capacity
Aira Rawat అందమే అసూయపడేలా! స్టేడియం మురిసేలా
Aira Rawat అందమే అసూయపడేలా! స్టేడియం మురిసేలా

కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. అల్టిమేట్ స్పోర్ట్స్ హబ్!

ఈ ప్రాజెక్ట్ కేవలం క్రికెట్ స్టేడియానికే పరిమితం కాకుండా.. అన్ని రకాల క్రీడలకు ఆశ్రయమిచ్చేలా ఒక మల్టీ-డిసిప్లినరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌గా రూపుదిద్దుకోనుంది. ఇందులో అత్యాధునిక శిక్షణ కేంద్రాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో ప్రపంచ స్థాయి ఒలింపిక్ ఈవెంట్లకు సైతం ఆతిథ్యం ఇవ్వడంతో పాటు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని వర్ధమాన క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి కోచింగ్ అందించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం.

ప్రపంచంలోనే తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్
ప్రపంచంలోనే తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్

ఈ మెగా ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ఇది బెంగళూరు క్రీడా రంగాన్నే పూర్తిగా మార్చేసే ఒక మైలురాయి అని కొనియాడారు. "ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ బెంగళూరు యొక్క క్రీడా పర్యావరణ వ్యవస్థను సరికొత్తగా పునర్నిర్మిస్తుంది. దేశం గర్వించదగ్గ ఎంతోమంది అథ్లెట్లను తయారు చేయడానికి, ఆశావాహ యువ క్రీడాకారులకు సరికొత్త అవకాశాలను సృష్టించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నుంచి అంతర్జాతీయ టోర్నమెంట్ల వరకు బెంగళూరులో ఎప్పుడూ ఉండే స్టేడియం రద్దీ సమస్యలకు ఈ కొత్త వేదిక శాశ్వత పరిష్కారం చూపించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+