మంత్రులకే మతిపోగొట్టిన ఓటర్లు, చిత్తుగా ఓడించి గేట్ పాస్ !
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్బంగా ఇంతకాలం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులకు షాక్ మీద షాక్ ఇచ్చారు. సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులుగా పని చేసిన నాయకులకే ఓటర్లు చుక్కలు చూపించారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ శింగ్లావిలో విజయం సాధించి ఊపిరి పీల్చుకున్నారు.
అయితే బసవరాజ్ బోమ్మయ్ క్యాబినేట్ లోని 10 మంది మంత్రులకు ఓటర్లు సినిమా చూపించారు. బీజేపీలో కచ్చితంగా గెలుస్తారని అనుకున్న నాయకులు చాలా మంది ఓడిపోయారు. బీఎస్ యడియూరప్ప క్యాబినేట్ లో మంత్రులుగా పని చేసిన చాలా మంది తరువాత బసవరాజ్ బోమ్మయ్ క్యాబినేట్ లో మంత్రులుగా పని చేశారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ సీట్లు సంపాధించుకున్న ఆ మంత్రులు ఇప్పుడు ఓటమిని చవిచూశారు. 10 మంది మంత్రుల మీద ప్రత్యర్థులు భారీ మెజారిటీతో దూసుకుపోయారు. బళ్లారి శ్రీరాములు, ఎంటీబీ నాగరాజ్, బీసీ పాటిల్, సోమణ్ణ, డాక్టర్ సుధాకర్, జేసీ. మధుస్వామి, సోమశేఖర్, ఆనంద్ సింగ్ కుమారుడు సిద్దార్థ సింగ్ తదితరుల నాయకలకు స్థానిక ఓటర్లు పెద్ద షాక్ ఇచ్చారు.
మాస్ లీడర్, బీజేపీ అధికారంలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న వాల్మీకి కులం నాయకుడు, మంత్రి బళ్లారి శ్రీరాములుకు స్థానిక ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. బళ్లారి శ్రీరాములు కచ్చితంగా గెలుస్తారని సర్వేలు చెప్పినా ఆ సర్వేలు మొత్తం రివర్స్ అయ్యాయి. భారీ మెజారిటీ తేడాతో నాగేంద్ర చేతిలో శ్రీరాములు ఓడిపోయారు.
మరో మంత్రి, సినిమా నటుడు, మాజీ పోలీసు అధికారి బీసీ పాటిల్ కూడా చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఇక లింగాయత్ నాయకుడు, మంత్రి, బెంగళూరుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకు వరుణ నియోజక వర్గంలో, చామరాజనగరలో పోటీ చేసిన మంత్రి వి. సోమణ్ణ చిత్తుచిత్తుగా ఓడిపోయారు.
చిక్కబళ్లాపురంలో ఇంతకాలం కింగ్ మేకర్ గా ఉన్న మంత్రి డాక్టర్ సుధాకర్ సైతం చిత్తుగా ఓడిపోయారు. హీరోలు సుదీప్, దర్శన్ తో పాటు కన్నడ సినీనటీనటులతో పాటు కామిడి కింగ్ బ్రహ్మానందం కూడా చిక్కబళ్లాపురంలో డాక్టర్ సుధాకర్ కు మద్దతుగా ప్రచారం చేసిన ఫలితంలేకుండా పోయింది. అయితే సుధాకర్ ను, బళ్లారి శ్రీరాములను స్థానికులు ఎందుకు ఓడించారు ? అనే విషయం అంతుచిక్కడం లేదని కన్నడిగులే అంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications