కరుణానిధి ప్రేమకథ: తాళికట్టేందుకు నిరాకరణ, పెళ్లి చేసుకోకుండానే ప్రియురాలు
చెన్నై: కరుణానిధికి ముగ్గురు భార్యలు ఉన్నారు. అయితే ఆయనకు పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారం కూడా ఉందట. దైవారాధనకు పూర్తి వ్యతిరేకుడైన కరుణానిధి తన తొలి ప్రియురాలిని వదులుకున్నారట.
Recommended Video

పెళ్లికి గుర్తుగా నిలిచే తాళిబొట్టును ప్రియురాలి మెడలో కట్టేందుకు కరుణానిధి ఏమాత్రం అంగీకరించలేదట. 1944 ప్రాంతంలో కరుణానిధి ఓ అమ్మాయిని ప్రేమించాడని, వారికి వివాహం చేసేందుకు ప్రియురాలి కుటుంబీకులు అంగీకరించారని చెబుతున్నారు.

కానీ సంప్రదాయబద్ధంగా వివాహం జరగాలని వారు కోరుకున్నారు. తనకు తాళి బొట్టుకట్టనని అతను తేల్చి చెప్పాడు. అవి లేకుంటే వివాహం చేయమని అమ్మాయి కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో ఆ పెళ్లి ఆగిపోయిందని చెబుతున్నారు.
ఈ ఆవేదనతో కరుణానిధి ప్రియురాలు మరో వివాహం చేసుకోకుండా జీవితాంతం అవివాహితగానే ఉండిపోయిందని చెబుతున్నారు. ఆచారాలను తీవ్రంగా వ్యతిరేకించే కరుణానిధి.. ఆ తరువాత ముగ్గురిని పెళ్లి చేసుకున్నారు. పెద్ద భార్య పద్మావతి చాలా సంవత్సరాల క్రితమే మరణించగా, ప్రస్తుతం రెండో భార్య దయాళు అమ్మాళ్, మూడో భార్య రాజాథీ అమ్మాళ్ ఉన్నారు.












Click it and Unblock the Notifications