నటి కిడ్నాప్, దాడి కేసు, దిలీప్ కు షాక్ ఇచ్చిన రెండో భార్య కావ్య, ఫేస్ బుక్ లో పేరు మాయం !

నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ప్రముఖ మాలీవుడ్ హీరో దిలీప్ అరెస్టు కావడడంతో ఆయన కుటుంబ సభ్యులు హడలిపోతున్నారు. నటుడు దిలీప్ సోదరుడు అనూప్ కూడా ఎక్కడ ఈ కేసు నా మెడకు చుట్టుకుంటుందో .

కొచ్చి: నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ప్రముఖ మాలీవుడ్ హీరో దిలీప్ అరెస్టు కావడడంతో ఆయన కుటుంబ సభ్యులు హడలిపోతున్నారు. నటుడు దిలీప్ సోదరుడు అనూప్ కూడా ఎక్కడ ఈ కేసు నా మెడకు చుట్టుకుంటుందో అంటూ హడలిపోతున్నాడు.

అయితే ఇప్పుడు తాజాగా దిలీప్ రెండవ భార్య, మలయాళం నటి కావ్య మాధవన్ పెద్ద షాక్ ఇచ్చారు. ఇంత కాలం కావ్య మాధవన్ అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ 'జనప్రియనాయకన్'దిలీప్ అని ఉండేది. దిలీప్ అరెస్టు అయిన తరువాత ఇంటి నుంచి బయటకు రాకుండా కావ్య మాధవన్ అజ్ఞాతంలోనే ఉన్నారు.

Kavya Madhayan the popular actress has reportedly quit facebook

బుధవారం కావ్య మాధవన్ దిలీప్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు. తన అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ నుంచి జనప్రియనాయకన్ దిలీప్ అనే పదం పూర్తిగా తొలించారు. అంతే కాకుండా ఆమె సోషల్ మీడియాలో ఎవ్వరికీ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. సోషల్ మీడియాలో కావ్య మాధవన్ మౌనంగా ఉండిపోయారు.

సన్నిహితులు, అభిమానులతో సహ ఆమె టచ్ లో లేరు. దిలీప్ అరెస్టు విషయంలో కావ్య మాధవన్ తీవ్ర విషాదంలో మునిగిపోయారని ఆమె సన్నిహితులు అంటున్నారు. మొత్తం మీద దిలీప్ ను అరెస్టు చేసిన తరువాత తన అధికారిక ఫేస్ బుక్ లో జనప్రియనాయకన్ దిలీప్ అనే పదాన్ని కావ్య మాధవన్ కావాలనే తొలగించారని, లేదంటే తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉందని మాలీవుడ్ సినీ వర్గాలు అంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+