కేర‌ళలో బెస్ట్ టూరిస్ట్ ప్రదేశాలు ఇవే.. లైఫ్ లో ఒక్కసారైనా చూసి తీరాల్సిందే..!

దేశంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్​ అండ్​ ఫ్యామిలీతో కలిసి ఏదైనా వెకేషన్ కు​ వెళ్లాలంటే వెంటనే అందరికీ గుర్తొచ్చే ప్రాంతం​ కేరళ. ఎందుకంటే ఇది పచ్చని కొండలు, ప్రకృతి అందాలకు కేరాఫ్​ అడ్రస్ గా ఉంటుంది. అందుకే కేరళను 'గాడ్స్ ఓన్ కంట్రీ' అని పిలుస్తుంటారు. దేశవ్యాప్తంగా అనేకమంది పర్యాటకులు ఎప్పుడు సెలవులు దొరికినా ​ఇక్కడికే వెళ్తుంటారు. కేరళలో టూరిస్ట్ ప్రాంతాలు అనేకం. వాటిలో మున్నార్, వయనాడ్, వగమాన్ ప్రాంతాలు ప్రముఖ హిల్ స్టేషన్లుగా ఉన్నాయి. ఇక అలప్పూజ, వర్కాల, కోవలం బీచ్ అందాలు పర్యటకుల్ని మైమరిపింపజేస్తాయి. ఇక్కడి అత్తిరపల్లి జలపాతం కూడా చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. ఇక కేరళలో సాధారణ పర్యాటక ప్రాంతాలతో పాటు ప్రశాంతమైన, అంతగా రద్దీ లేని ప్రదేశాలు కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి.

పర్యాటక స్వర్గధామంగా పిలిచే కేరళలో ముందుగా చెప్పుకోవాల్సిన ప్రదేశం మున్నార్.. ఇక్కడి పచ్చని టీ తోటలు.. ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇది కేరళలోనే ప్రముఖ హిల్ స్టేషన్. ఈ ప్రదేశం సముద్రమట్టానికి దాదాపు 1600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక ఇక్కడి కొండలపై నుంచి కనిపించే లోయలతోపాటుగా, సూర్యోదయం-సూర్యాస్తమయం దృశ్యాలు మున్నార్‌ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వేసవి వేడి నుంచి కాస్త ఉపశమనం కోరుకునేవారికి ఇది మంచి గమ్య స్థానంగా నిలుస్తుంది. పొగమంచుతో కప్పబడిన ఈ ప్రాంతంలో ఫొటోలు దిగితే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది.

ఇక అలప్పుజ అనగానే ముందుగా కేరళలోని బ్యాక్ వాటర్స్ గుర్తొస్తాయి. కాలువల మధ్య పచ్చని కొబ్బరి చెట్లు అలాగే ఇక్కడి హౌజ్ బోట్లలో ప్రయాణం మరచిపోలేని అనుభూతిని అందిస్తోంది. అలప్పుజను వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ గా పిలుస్తుంటారు. ఇక్కడి బ్యాక్ వాటర్, హౌజ్ బోట్ ప్రయాణాలు ప్రపంచ పర్యటకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ప్రశాంతమైన కొండలకు వాగమాన్ పెట్టింది పేరు. బిజీ లైఫ్ నుంచి కాస్త ప్రశాంతమైన వాతావరణం కోరుకునేవారికి ఈ ప్రాంతం సరైనదిగా చెప్పొచ్చు. ఇక్కడి కొండలపై ఆహ్లాదకరమైన వాతావరణం అద్భుతంగా ఉంటుంది. అటు ఫొటోగ్రఫీకి కూడా ఇక్కడ ఎన్నో అందమైన ప్రదేశాలు మనకు కనిపిస్తాయి.

Kerala best tourist destinations in you are bound to be captivated by the natural beauty of places

సూర్యోదయం, సూర్యాస్తమయం ప్రకృతి ప్రసాదించే ఈ దృశ్య కావ్యాలను ఎక్కడి నుంచి చూసినా అద్భుతంగానే ఉంటుంది. మరి కేరళలోని వర్కల అనే ప్రాంతం నుంచి ఈ అద్భుతమైన దృశ్యాలను చూస్తే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. ఇక్కడ ఉదయం అరేబియా సముద్రం వద్ద సూర్యోదయం చూస్తూ గడపడం, సాయంత్రం వేళ సూర్యాస్తమయం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక అడవి అందాలను ఆస్వాధించాలనుకునేవారికి టెక్కడి బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ గా ఉంటుంది. వీటితోపాటు కొచ్చి, అత్తిరపల్లి వాటర్ ఫాల్స్, కుమరకోమ్ ప్రకృతి అందాలు, కోవలం బీచ్ కూడా పర్యటకుల్ని మైమరిపింపజేస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+