Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేరళ: సీఎం స్వస్ధలంలో బీజీపే కార్యకర్తను నరికి చంపారు

తిరువనంతపురం: కేరళలోని కన్నూర్‌ జిల్లాలోని పినరయిలో బీజేపీకి చెందిన ఓ కార్యకర్తను అత్యంత దారుణంగా హతమార్చారు. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం 10 గంటల సమయంలో పినరయి గ్రామంలోని పెట్రోల్ బంకు వద్ద ఓ వ్యక్తిని నరికి చంపారు.

బాధితుడిని రెమిత్‌గా గుర్తించామని అన్నారు. బీజేపీ నేతగా ఉన్న రెమిత్ తండ్రి ఉతహ్మాన్‌‌ని కూడా సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇలానే హత్యకు గురయ్యారు. అయితే ఈ ఘటన కేరళ ముఖ్యమంత్రి విజయన్ సొంత పట్టణంలో జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Kerala: BJP worker hacked to death in CM Vijayan's hometown

దుండగులు ముసుగులో వచ్చి ఈ హత్య చేసి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన నేపథ్యంలో గురువారం కన్నూరు జిల్లాలో బీజీపే బంద్‌కు పిలుపునిచ్చింది. సోమవారం సీపీఎం సీనియర్ నాయకుడు కె. మోహనన్ (52) హత్యకు గురయ్యారు.

ఈ హత్య వెనుక ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన జరిగిన రెండో రోజే ఇదే జిల్లాకు చెందిన రెమిత్‌ అనే బీజేపీ కార్యకర్తను దారుణంగా నరికి చంపారు. ఈ రెండు ఘటనలతో బీజేపీ, సీపీఎం కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.

Kerala: BJP worker hacked to death in CM Vijayan's hometown

ఇదిలా ఉంటే కేరళలో ఇప్పుడున్న ప్రభుత్వ పాలనలో మే నుంచి ఇప్పటివరకు జరిగిన రాజకీయ దాడులకు సంబంధించి 300లకు పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ రెండు హత్యలు కూడా సీఎం పినరయి విజయన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మడామ్ నియోజకవర్గం పరిధిలోనే జరిగాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+