Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్..

కేరళలో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు గాను ఏప్రిల్ 9న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే మే 4 న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నేతృత్వంలోని LDF ప్రభుత్వం వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది.

ఇక కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డ్రై డే ను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికలకు 48 గంటల ముందు అంటే ఏప్రిల్ 7 నుంచి రెండు రోజులపాటు కేరళలో 'డ్రై' డే ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది. దాంతో డ్రై డే లో భాగంగా ఏప్రిల్ 7 నుంచి 2 రోజులపాటు రాష్ట్రంలో మద్యం దుకాణాలను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం ఏప్రిల్ 7 న రాత్రి 7 గంటల నుంచి ఏప్రిల్ 9 పోలింగ్ ముగిసేంతవరకూ కొనసాగుతుంది.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించడంతో పాటుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అలాగే ఫలితాలు వెల్లడి రోజైన మే 4 న కూడా సెపరేట్ డ్రై డే ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంది పినరయి విజయన్ సర్కార్.

Kerala Elections Statewide Dry Day Declared Liquor Shops Closed for 2 Days from April 7 Kerala news

ఇక కేరళలో ఎన్నికల వేడి తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్రంలో పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష కూటమి (LDF) హ్యాట్రిక్ విజయం సాధించాలని చూస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) ఈసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉంది. ఇక బీజేపీ సైతం కేరళ ప్రాంతంలో బలమైన మూడో శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక సంక్షేమ పథకాలపైనే విజయన్‌ ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని యూడీఎఫ్ ధీమాతో ఉంది. మరోవైపు ఈసారైనా ఎన్నికల్లో బోణీ కొట్టాలని బీజేపీ ఆరాటపడుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+