Gold Smuggling: కస్టమ్స్ ఆఫీసులో ఐఏఎస్, రాజముద్ర దుర్వినియోగం, సార్ టీంలో ఎందరున్నారు ?
కొచ్చి/ తిరువనంతపురం/ బెంగళూరు: రాజముద్రను (ప్రభుత్వ అధికారం) అడ్డం పెట్టుకుని విదేశాల నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వారికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ సస్పెండ్ కు గురైన కేరళ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. శివశంకర్ కు శంకరాభరణం కష్టాలు ఎదురైనాయి. శుక్రవారం కస్టమ్స్ అధికారుల ముందు హాజరైన ఐఏఎస్ అధికారి విచారణ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఉక్కిరి బిక్కిరి అయ్యారని తెలిసింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలకసూత్రదారి స్వప్న సురేష్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారని వెలుగు చూడటంతో ఐఏఎస్ అధికారి శివశంకర్ ను కస్టమ్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. సార్ స్వప్న టీంలో ఇంకా ఎంతమంది ఉన్నారు ? అని అధికారులు ఆరా తీశారని తెలిసింది.

స్వప్న స్టోరీ తెలిసినా సార్ చెప్పలేదు
గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం ముందు నుంచి శివశంకర్ కు తెలిసినా ఆ విషయం బయటకు రాకుండా అధికారం దుర్వినియోగం చేశారని అధికారులు ఆరోపిస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులోని నిందితులతో ఐఏఎస్ అధికారి శివశంకర్ కు సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే కస్టమ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

స్వప్న ఫ్యామిలీతో ఏం పని ?
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయ్యి జైల్లో ఉన్న స్వప్న సురేష్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులతో కేరళ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. శివశంకర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే అధికారుల విచారణ వెలుగు చూసింది. ఇప్పటికే అనేకసార్లు స్వప్న సురేష్ ను ఐఏఎస్ అధికారి శివశంకర్ ఆర్థిక సహాయం చేశారని, ఆమెను అన్నిరకాలుగా ఆదుకున్నారని అధికారులు విచారణలో వెలుగు చూసింది.

సార్ హామీ ఇస్తేనే బ్యాంకు లాకర్లు !
కేరళ అధికార పార్టీ నేతలతో స్వప్న సురేష్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వెలుగు చూడటంతో కలకలం రేపింది. చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాల్ తో పాటు స్వప్న సురేష్ ఓ జాతీయ బ్యాంకులో జాయింట్ లాకర్లు తెరిచారని అధికారులు గుర్తించారు. స్వప్న సురేష్ బ్యాంకు లాకర్లు పరిశీలించిన అధికారులు అందులో రూ. 1. 50 కోట్ల నగదు, రూ. కోట్లు విలువైన బంగారం ఉన్నట్లు గుర్తించారు. జాతీయ బ్యాంకులో స్వప్న సురేష్ సీక్కెట్ బ్యాంకు లాకర్లు పెట్టుకోవడానికి ఐఏఎస్ అధికారి శివశంకర్ సహకరించారని ఇప్పటికే అధికారులు కొచ్చిలోని ప్రత్యేక కోర్టుకు ఆధారాలు సమర్పించారు.

స్వప్నకు షాక్ ఇచ్చిన అధికారులు
స్వప్న సురేష్ కు కేరళ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు సహకరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు. స్వప్న సురేష్ బ్యాంకు లాకర్లు తీసిన అధికారులు అందులోని డబ్బులు, బంగారం చూసి వారి దిమ్మ తిరిగిపోయిందని తెలిసింది. ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు స్వప్న సురేష్ బ్యాంకు లాకర్లు సీజ్ చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా అక్రమంగా సంపాధించిన డబ్బులు, బంగారాన్ని స్వప్న సురేష్ బ్యాంకు లాకర్లలో దాచిపెట్టారని వెలుగు చూసింది. బ్యాంకులో అక్రమ సంపాధన దాచుకోవడానికి ఐఏఎస్ అధికారి శివశంకర్ సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.

సార్ మీ టీమ్ లో ఇంకా ఎవరైనా ఉన్నారా ?
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు వ్యక్తిగత ప్రధాన కార్యదర్శిగా, ఆ రాష్ట్ర ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేసే సమయంలోనే ఐఏఎస్ అధికారి స్వప్న సురేష్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. ఒక ఐఏఎస్ అధికారి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న లేడీ కిలాడీతో ఎందుకు సంబంధాలు పెట్టుకున్నారు ? వీరి వెనుక ఎవరెవరు ఉన్నారు ? అనే కోణంలో అధికారులు విచారణ ముమ్మరం చేశారు.
Recommended Video

రండి సార్ రండి, మీకోసమే వెయిటింగ్
ఐఏఎస్ అధికారి శివశంకర్ ను మరింత లోతుగా విచారణ చేసి పూర్తి వివరాలు సేకరించాలని ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ అధికారులు సిద్దం అయ్యారు. అందులో భాగంగానే శుక్రవారం ఐఏఎస్ అధికారి శివశంకర్ ను కస్టమ్స్ అధికారులు కొన్ని గంటల పాటు విచారణ చేసి వివరాలు సేకరించారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారి శివశంకర్ ను ఈడీ అధికారులు రెండుసార్లు విచారణ చేసి వివరాలు సేకరించారు. ఐఏఎస్ అధికారి శివశంకర్ స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డు చేస్తున్నారు. మొత్తం మీద మేడమ్ స్వప్న సురేష్ దెబ్బతో ఐఏఎస్ అధికారి శివశంకర్ కు ఎలాంటి పరిస్థితి వస్తుందో ? అనే భయం ఆయన సన్నిహితులకు మొదలైయ్యింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications