చేప కొరికితే నిర్లక్ష్యం చేశాడు.. చివరకు చెయ్యి తీసేయాల్సి వచ్చింది

చేప కొరికితే చేయి తీసేయాల్సి వచ్చిన సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటనలు సాధారణంగా చేప కొరికిన చోట ఇన్ఫెక్షన్ సోకడం వల్ల జరుగుతాయి.కొరికింది చేప కదా అని ఓ యువకుడు నిర్లక్ష్యం వహించాడు. దీంతో చివరకు చేప కొరికిన చేతిని శాశ్వతంగా తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన మరెక్కడో కాదు కేరళలో చోటు చేసుకుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..38 ఏళ్ల రాజేష్ అనే రైతు కన్నూరు జిల్లాలో నివాసం ఉంటున్నాడు.

రాజేష్ తన పొలం దగ్గర పని చేస్తుండగా, ఓ చేప అతని చేతిని కొరికింది. మొదట చేప కదా అని నిర్లక్ష్యం వహించాడు. అయితే మరుసటి రోజుకు ఆ చేప కొరికిన చేతిపై బొబ్బలు రావడం మొదలయ్యాయి. దీంతో రాజేష్ ఆస్పత్రికి వెళ్లి టీటీ ఇంజక్షన్ తీసుకున్నాడు. టీటీ ఇంజక్షన్ చేయించుకోవడంతో చేతిపై బొబ్బలు తగ్గుతాయని భావించాడు. అయితే ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మణికట్టు వరకు సోకింది. మొదట చిన్న గాయమే అనుకున్న రాజేష్‌కు అది ప్రాణాంతకంగా మారింది.

Kerala man loses palm to rare infection

ఎంతకీ గాయం తగ్గకపోవడంతో మరోసారి ఆసుపత్రికి వెళ్ళాడు. గాయాన్ని పరీక్షించిన వైద్యులు అది గ్యాస్ గ్యాంగ్రీన్‌ అనే అరుదైన వ్యాధిగా నిర్ధారించారు. దీంతో వెంటనే ప్రైవేట్ హాస్పిటల్‌‌లో చేరినప్పటికీ అప్పటికే ఆలస్యం అయిందని వైద్యులు తెలిపారు. ఇన్ఫెక్షన్ చేతి వరకు వచ్చేసిందని అరచేతిని పూర్తిగా తొలగించకపోతే ప్రాణాలకు ప్రమాదం ఉందని,ఈ బ్యాక్టీరియా మెదడుకు కూడా వ్యాపించే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు.దీంతో ముందుగా చేతి వేళ్లు తొలగించిన డాక్టర్లు .. ఆ తర్వాత మణికట్టు వరకు చేయిని తొలగించారు.

ఇది గ్యాస్ గ్యాంగ్రీన్ అనేది ఒక అరుదైన కానీ ప్రాణాంతకమైన బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.ఇది కండరాలు, చర్మం మరియు ఇతర కణజాలాలను వేగంగా నాశనం చేస్తుంది. ఇది క్లోస్ట్రిడియం పెర్‌ఫ్రింజెన్స్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది, ఇది గాయాలు లేదా శస్త్రచికిత్స ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.

గ్యాస్ గ్యాంగ్రీన్ వ్యాధికి కారణాలు:
కండరాలకు హాని కలిగించే గాయాలు, ముఖ్యంగా మట్టి లేదా శిధిలాలతో కలుషితమైనవి. కొన్ని రకాల శస్త్రచికిత్సల తర్వాత, ముఖ్యంగా కడుపు శస్త్రచికిత్స తర్వాత. మధుమేహం ఉన్నవారిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది, కాబట్టి వారికి సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.ఈ వ్యాధి రక్త నాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది, ఇది కణజాలాలకు రక్త సరఫరాను తగ్గిస్తుంది మరియు సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది.

గ్యాస్ గ్యాంగ్రీన్ వ్యాధి లక్షణాలు:
గాయం చుట్టూ తీవ్రమైన నొప్పి, వాపు ఉంటుంది.చర్మం పాలిపోవడం, ఆపై ఎరుపు, ఊదా లేదా నల్లగా మారడం వంటివి కనిపిస్తాయి.గాయం దగ్గర దుర్వాసనతో కూడిన బుడగలు దర్శనం ఇస్తాయి. చర్మం కింద గ్యాస్ పేరుకుపోవడం, ఇది నొక్కినప్పుడు క్రాకిల్ ధ్వనిని కలిగిస్తుంది
జ్వరం,గుండె వేగంగా కొట్టుకోవడం ,తక్కువ రక్తపోటు వంటి శరీర మార్పులు కనిపిస్తాయి.

చికిత్స:
గ్యాస్ గ్యాంగ్రీన్ అనేది ఒక వైద్య అత్యవసరం. చికిత్సలో ఇవి ఉంటాయి. సోకిన కణజాలాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స అవసరం.బ్యాక్టీరియాను చంపడానికి అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఇవ్వబడతాయి.అధిక పీడనం గల గదిలో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పీల్చడం వల్ల కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది మరియు బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+