కేరళ లేడీ టీచర్ హత్య, డ్రాయింగ్ మాస్టర్ ఫ్రెండ్, అదే లింక్ తో నమ్మించి పిలిపించి, తల వెంట్రుకలు !

కొచ్చి/ కాసరగూడు: ఇంటి నుంచి బయటకు వెళ్లిన లేడీ టీచర్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన కేసులో ఆమె స్నేహితుడు, సాటి డ్రాయింగ్ మాస్టర్ హంతకుడు అని వెలుగు చూసింది. స్నేహితుడు అని నమ్మి అతను పిలిచిన వెంటనే వెళ్లిన లేడీ టీచర్ ను అతి దారుణంగా హత్య చేశారు. స్నేహం, ఆర్థిక లావాదేవీల కారణంగానే ఆమె హత్యకు గురైయ్యిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. హత్యకు గురైన లేడీ టీచర్ తల వెంట్రుకలు హంతకుడిని పట్టించాయని పోలీసులు తెలిపారు.

 టీచర్ మాయం

టీచర్ మాయం

కేరళలోని కాసరగూడు (కర్ణాటక-కేరళ సరిహద్దు)లోని మీయపదవు విద్యావర్ధక హైయ్యర్ సెకండరీ స్కూల్ లో రూపశ్రీ (44) అనే మహిళ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నారు. 2020 జనవరి 14వ తేదీన స్కూల్ కు సెలవు కావడంతో రూపశ్రీ ఇంటిలో ఉన్నారు. అయితే అదే రోజు సాయంత్రం ఇంటి నుంచి పనిమీద బయటకు వెళ్లిన రూపశ్రీ తరువాత తిరిగి రాలేదు.

లోయలో శవమైన రూపశ్రీ

లోయలో శవమైన రూపశ్రీ

జనవరి 16వ తేదీన పెరవాడు సమీపంలోని లోయలో రూపశ్రీ శవమై కనిపించింది. రూపశ్రీ అనుమానాస్పద స్థితిలో మరణించిందని మంజేశ్వర పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రూపశ్రీ హత్యకు గురైయ్యిందని, తెలిసిన వారే హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డ్రాయింగ్ టీచర్ ఫ్రెండ్

డ్రాయింగ్ టీచర్ ఫ్రెండ్

రూపశ్రీ పని చేస్తున్న స్కూల్ లో వెంకటరమణ కారంత (48) డ్రాయింగ్ టీచర్ గా పని చేస్తున్నాడు. రూపశ్రీ, డ్రాయింగ్ టీచర్ వెంకటరమణ మంచి ఫ్రెండ్స్. అంతే కాకుండా రూపశ్రీ, వెంకటరమణల మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అయితే కొంత కాలం నుంచి ఇద్దరి మధ్య స్నేహం, ఆర్థిక లావాదేవీల విషయంలో మనస్పర్థలు వచ్చాయని వెలుగు చూసింది.

పక్కాప్లాన్ తో రూపశ్రీ హత్య

పక్కాప్లాన్ తో రూపశ్రీ హత్య

జనవరి 14వ తేదీన సెలవు కావడంతో రూపశ్రీ, వెంకటరమణ ఇద్దరూ స్కూల్ కు వెళ్లలేదు. అదే రోజు సాయంత్రం నీతో మాట్లాడాలని రూపశ్రీని వెంకటరమణ తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన వెంకటరమణ పక్కాప్లాన్ తో రూపశ్రీని నీళ్ల బకెట్ లో ఆమె తలను ముంచి ఊపిరి ఆడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు.

 స్నేహితుడి కారులో శవం

స్నేహితుడి కారులో శవం

రూపశ్రీని హత్య చేసిన వెంకటరమణ తరువాత స్నేహితుడు నిరంజన్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తరువాత రూపశ్రీ శవాన్ని నిరంజన్ కారులో తీసుకెళ్లి పెరవాడు సమీపంలోని లోయలో విసిరివేసి పరారైనారు. రూపశ్రీ శవం స్వాధీనం చేసుకున్న తరువాత మొదటి నుంచి వెంకటరమణ మీద అనుమానం ఉన్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

 హంతకుడిని పట్టించిన రూపశ్రీ వెంట్రుకలు

హంతకుడిని పట్టించిన రూపశ్రీ వెంట్రుకలు

రూపశ్రీ హత్య కేసు విచారణ చేస్తున్న పోలీసులు వెంకటరమణను అదుపులోకి తీసుని విచారణ చెయ్యగా ఎలాంటి ఫలితం లేకపోయింది. తాను రూపశ్రీని హత్య చెయ్యలేదని వెంకటరమణ పదేపదే చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. అయితే వెంకటరమణ స్నేహితుడు నిరంజన్ కారును పరిశీలించిన పోలీసులకు ఆ కారు డిక్కీలో మహిళ తల వెంట్రుకలు చిక్కాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ కు తల వెంట్రుకలు పంపించగా అవి రూపశ్రీవి అని వెలుగు చూసింది. రూపశ్రీని హత్య చేసిన వెంకటరమణను, శవాన్ని మాయం చెయ్యడానికి సహకరించిన నిరంజన్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+