ప్రేమించి, పెళ్లి: భార్యను ఐఎస్‌కు సెక్స్ బానిసగా అమ్మే యత్నం, అరెస్ట్
తిరువనంతపురం: ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత.. ఆమెను ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అమ్మేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుడు రియాజ్ మొహమ్మద్ ది కేరళలోని కొచ్చి. అతని భార్య గుజరాత్‌లోని జామ్ నగర్‌కు చెందిన యువతి. కాగా, తన తండ్రి ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత ఆమె కుటుంబం అంతా కేరళకు మకాం మార్చింది.
ఒకే కాలేజీలో చదువుకుంటున్న తరుణంలో 2014లో బాధితురాలితో రియాజ్‌కు పరిచయం ఏర్పడింది. ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించి, నమ్మించాడు. ఆ తర్వాత వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న వీడియోలను చూపి, భయపెట్టి ఇస్లాం మతంలోకి మారాలని, తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. ఈ నేపథ్యంలో, వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు.

కాగా, మొహమ్మద్ రియాజ్ తల్లిదండ్రులు సౌదీఅరేబియాలోని జెడ్డాలో ఉంటారు. పెళ్లి అయిన తర్వాత తన భార్యను తీసుకుని జెడ్డా వెళ్లాడు రియాజ్. అనంతరం సిరియాలో ఆమెను ఐసిస్‌కు సెక్స్ బానిసగా అమ్మేందుకు యత్నించాడు. అయితే, సరైన సమయంలో విషయాన్ని పసిగట్టిన బాధితురాలు.. జరుగుతున్న విషయం గురించి తన తల్లిదండ్రులకు తెలియజేసింది.
ఈ ఘటనకు సంబంధించి కొచ్చిలోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మరోవైపు, ఎన్ఐఏ ఈ ఘటనపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో, ఆదివారం చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన రియాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని వద్ద నుంచి సెల్‌ఫోన్, పెన్ డ్రైవర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications