జేఎంఎం కూటమి విజయం వెనుక- బీజేపీ బిగ్ మిస్టేక్..!!
Jharkhand Election 2024 Results : జార్ఖండ్ లో జేఎంఎం కూటమి విజయం సాధించింది. సీఎం సోరెన్ వ్యూహాలు మరోసారి గెలుపు అందించాయి. ప్రతిపక్ష బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆశలు ఫలించలేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. బీజేపీ చేసిన ఆ ఒక్క తప్పే జేఎంఎం కూటమికి కలిసి వచ్చింది. లోకల్ ఓటరు నాడి పూర్తిగా తెలిసిన సోరెన్ తమ కటమి విజయంలో ఒన్ మ్యాన్ ఆర్మీగా నిలిచారు. దీంతో, మరోసారి జార్ఖండ్ సీఎం కాబోతున్నారు.
సోరెన్ వ్యూహాలు
జార్ఖండ్ లో అంచనాలకు అందకుండా జేఎంఎం కూటమి విజయం సాధించింది. జేఎంఎం కూటమి తాజా సమాచారం మేరకు 57 సీట్లు దక్కించుకుంది. బీజేపీ కూటమి 27 సీట్లకే పరిమితం అయింది. ఎగ్జిట్ పోల్స్ తో పాటుగా రాజకీయ విశ్లేషకులు సైతం ఈ సారి జార్ఖండ్ లో బీజేపీ కూటమికి ఛాన్స్ ఉంటుందని అంచనా వేసారు. కానీ, కౌంటింగ్ ఆరంభం నుంచే జేఎంఎం కూటమి హవా కొనసాగింది. అవినీతి కేసులో జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ అరెస్టు వేధింపుల కింద రాష్ట్ర ప్రజలు పరిగణించినట్లు స్పష్టం అవుతోంది. దీనిని బీజేపీ చేసిన రాజకీయ కుట్రగా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో జేఎంఎం సక్సెస్ అయింది.

బీజేపీ ప్రచారం
కానీ, దీనిని బీజేపీ సమర్ధవంతంగా తిప్పి కొట్టలేకపోయింది. ఆ పొరపాటే బీజేపీ ఓటమిలో కీలకంగా మారింది. ఇక..జేఎంఎం మహిళలకు అందిస్తున్న వెయ్యి రూపాయాల నగదు మొత్తాన్ని రూ 2500 కి పెంచింది. మహిళా ఓట్లను దక్కించుకోవటంలో ఈ పథకం కీలకంగా మారింది. అదే విధంగా సర్నాను ప్రత్యేక మతంగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయటం కూడా కలిసొచ్చినట్లు ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. సోరెన్ అరెస్ట్ సమయంలో ఆయన సతీమణి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. బీజేపీని టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. మహిళలను ఆకట్టు కోవటంలో సక్సెస్ అయ్యారు. సోరెన్ విడుదల అయిన తరువాత ఆయనతో కలిసి వందల సంఖ్య లో పార్టీ సమావేశాలు..ప్రజలతో మమేకం అవుతూ వరుస కార్యక్రమాలు నిర్వహించారు.
సోరెన్ కే పట్టం
బీజేపీ జార్ఖండ్ లో పూర్తిగా సోరెన్ అవినీతిని ఎన్నికల ప్రచార అస్త్రంగా మలచుకుంది. అదే విధంగా బంగ్లాదేశ్ చొరబాటు దారులకు సోరెన్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఆరోపించింది. అటు వైపు సోరెన్ అరెస్ట్ తో ఆయన పైన పెరిగిన సానుభూతి ముందు బీజేపీ చేసిన ఆరోపణలు ప్రజలను ఒప్పించలేకపోయాయి. చంపయ్ సోరెన్ , సీతా సోరెన్ బీజేపీ లోకి చేర్చుకోవటంతో జేఎంఎం కు నష్టం తప్పదని అందరూ భావించారు. చంపాయి తమతో కలవటం కలిసి వస్తుందని బీజేపీ లెక్కలు వేసింది. కానీ, ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. జేఎంఎం - కాంగ్రెస్ కూటమి పై బీజేపీ అస్త్రాలు ఫలించలేదు. వాస్తవ ఫలితాల్లో మాత్రం ప్రజలు సోరెన్ నాయకత్వానికి మరోసారి పట్టం కట్టారు.












Click it and Unblock the Notifications