కేజీఎఫ్ కంటే ఐదు రెట్లు గొప్ప సినిమా సలార్, అలెక్సా 39, గ్రాఫిక్స్ ఎంతసేపు అంటే, గౌడ క్లారిటి !

ప్రబాస్ నటించిన సలార్ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్ చిత్రాన్ని వందల కోట్ల రూపాయలతో నిర్మించారు. ట్రైలర్ చూడగానే ఇది చాలా మాస్ సినిమా అని తెలిసింది. ఇద్దరు స్నేహితుల కథను అనేక ట్విస్టులతో సినీ ప్రేక్షకులను కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రాణ స్నేహితులు ఎందుకు బధ్ద శత్రువులుగా మారారు? అనే కథను ప్రశాంత్ నీల్ రసవత్తరంగా తెరకెక్కించారని తెలిసింది. స్యాండిల్ వుడ్ కు చెందిన హోంబళే సంస్థ రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేసి భారీ బడ్జెట్‌తో సలార్‌ చిత్రాన్ని నిర్మించారు. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలు కూడా ఇదే హోంబాళే బ్యానర్ లో నిర్మించారు. కేజీఎఫ్‌ తరహాలో ఈ చిత్రానికి గ్రాండ్‌ గా భారీ సెట్టింగ్ లు వేశారు. అయితే కేజీఎఫ్ సినిమా షూటింగ్ జరిగిన కర్ణాటకలోని కోలారు సమీపంలోని కేజీఎఫ్ ఊరు సమీపంలోని బంగార గనుల మాత్రం సలార్ షూటింగ్ కోసం సెట్టింగ్ లు వెయలేదని ఆ సినిమాకు పని చేసిన నిపుణులు అంటున్నారు.

KGF Cameraman Bhuvan Gowda said that Salaar is five times better than KGF film series

ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ సలార్ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. సలార్ సినిమా సెట్టింగ్ లకు ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ ప్రాణం పోశారని ఆ సినిమా యూనిట్ అంటోంది. కేజీఎఫ్ చిత్రాలకు కెమెరామెన్ గా పని చేసిన భువన్ గౌడ సలార్ సినిమాకు కూడా కెమెరామెన్ గా పని చేశాడు. రెబల్ స్టార్ హీరోగా నటించిన సలార్ సినిమాకు చేసిన అనుభవాన్ని కెమెరామెన్ భువన్ గౌడ కన్నడ టీవీ చానల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సలార్ సినిమా ఎక్కువ భాగం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించామని, టెక్నికల్‌ పరంగా లెక్క వేస్తే కేజీఎఫ్‌ కంటే ఐదు రెట్లు పెద్ద సినిమా అని భువన్ గౌడ అన్నారు. సలార్ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కువ శాతం చిత్రీకరించారని, ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ తదితరుల బృందం 100 ఎకరాల విస్తీర్ణంలో భారీ సెట్‌ లు నిర్మించారని, దండుమైలారం అనే ప్రదేశంలో అర్ద కిలోమీటరు పొడవు తాత్కాలికంగా కాంపౌడ్ నిర్మించారని కెమెరామెన్ భువన్ గౌడ చెప్పారు.

సాంకేతికంగా సలార్ సినిమాను మరో స్థాయికి తీసుకెలుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని, ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత పెద్ద సెట్ సలార్ కు వేశారని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదని కెమెరామెన్ భువన్ గౌడ అన్నారు. అలెక్సా 39 అనే అత్యాధునిక కెమెరాతో సలార్ సినిమాను తెరకెక్కించామని, ఈ అలెక్సా 39 కెమెరా ఫుటేజ్ ఐమ్యాక్స్ నాణ్యతతో ఉంటుందని భువన్ గౌడ చెప్పారు.

KGF Cameraman Bhuvan Gowda said that Salaar is five times better than KGF film series

కేజీఎఫ్ సినిమాతో పోలిస్తే సలార్ ఐదు రెట్లు పెద్ద సినిమా అని భువన్ గౌడ అన్నారు. సలార్ సినిమా చాలా వరకు ప్రత్యేకమైన సెట్స్ పైనే షూటింగ్ జరుపుకుందని, కేవలం ఐదు శాతం మాత్రమే గ్రాఫిక్స్ ఉపయోగించామని, కాబట్టి సలార్ సినిమా చాలా రియలిస్టిక్‌గా ఉంటుందని కెమెరామెన్ భువన్ గౌడ అన్నారు. భువన్‌గౌడ తొలిసారిగా సినిమాటోగ్రాఫర్‌గా ఉగ్రం సినిమాకు పనిచేశాడు.

ఆ తర్వాత రథావర, పుష్పక విమానం సినిమాలకు కెమెరామెన్ గా పని చేసిన భువన్ గౌడ తరువాత కేజీఎఫ్ సిరీస్ సినిమాలకు కెమెరామెన్ గా చాన్స్ కొట్టేశాడు. కేజీఎఫ్ సినిమాలతో భువన్ గౌడ మంచి సినిమాటోగ్రఫర్ గా ప్రశంసలు అందుకున్నాడు. కేజీఎఫ్ సిరీస్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ తరువాత భువన్ గౌడ అంతే ఉత్సాహంతో సలార్ టీమ్‌లో చేరాడు.

కేజీఎఫ్ సినిమాలకు పనిచేసిన ప్రశాంత్ నీల్, రవి బస్రూరు, భువన్ గౌడ, శివకుమార్ కూడా సలార్ సినిమాకు మూలస్తంభాలుగా నిలిచారు. డిసెంబర్ 22వ తేదీన సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్ రిలీజ్ దుమ్ము రేపాయి. సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సలార్ సినిమా విడుదలకు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+