khiladi: సీఎం ఇంటి దగ్గర సెక్యూరిటీ టీమ్ పోలీసులు, పార్ట్ టైమ్ గంజాయి స్మగ్లింగ్, కేటుగాళ్లు !
బెంగళూరు: ముఖ్యమంత్రి నివాసం దగ్గర నిత్యం పోలీసులు బందోబస్తులో ఉంటారు. చురుకుగా ఉంటున్న పోలీసులను, ఎస్ఐలను సీఎం నివాసం దగ్గర భద్రతా ఏర్పాట్లలో నియమించారు. సీఎం ఇంటి దగ్గర ఉంటున్న ఇద్దరు పోలీసులు చలాకిగా ఉండటంతో పై అధికారులు సంతోషించారు. ఇద్దరు పోలీసులను కలవడానికి కొందరు అక్కడికి వెళ్లి వస్తున్నారు. స్నేహితులు పోలీసుల కోసం వచ్చి వెలుతున్నారని సాటి పోలీసులు అనుకున్నారు. అయితే ఇద్దరు పోలీసులు కలిసి సిట్టింగ్ సీఎం ఇంటి ముందు ఇద్దరిని చావబాదుతున్న విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ పోలీసులు గస్తీ తిరుగుతున్న సమయంలో గమనించారు. అంతే పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయం బయటకు వచ్చింది. సీఎం ఇంటి దగ్గర బందోబస్తులో ఉన్న ఇద్దరు పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్నారని తెలుసుకున్న పోలీసు అధికారులు బిత్తరపోయారు. సీఎం ఇంటి దగ్గరే ఉంటున్న పోలీసులు గంజాయి విక్రయిస్తున్నారని వెలుగు చూడటం ఐటీ హబ్ లో కలకలం రేపింది. ఇటీవలే అల్లు అర్జున్ నటించిన పుష్పా సినిమా టైపులో ఆ సినిమాకు పోటీగా ఇద్దరు పోలీసులు గంధం చెక్కలు విక్రయిస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే.

సీఎం ఇంటి దగ్గర బందోబస్తు
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ బెంగళూరులోని ఆర్ టీ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఆర్ టీ నగర్ లోని బసవరాజ్ బోమ్మయ్ ఇంటి దగ్గర నిత్యం పోలీసులు బందోబస్తులో ఉంటారు. చురుకుగా ఉంటున్న పోలీసులను, ఎస్ఐలను సీఎం నివాసం దగ్గర భద్రతా ఏర్పాట్లలో నియమించారు.

సీఎం ఇంటి దగ్గర కిలాడీ పోలీసులు
కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఇంటి దగ్గర శివకుమార్, సంతోష్ అనే ఇద్దరు పోలీసులు విధుల్లో ఉన్నారు. శివకుమార్, సంతోష్ చాలా చలాకిగా సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఇంటి దగ్గర బందోబస్తులో ఉండటంతో వారి పై పోలీసు అధికారులు సంతోషించారు. అయితే సీఎం ఇంటి దగ్గర ఉంటున్నామని ధీమాతో సంతోష్, శివకుమార్ చేతివాటం చూపిస్తారని పై అధికారులు ఊహించలేకపోయారు.

సీఎం ఇంటి దగ్గర ప్రత్యేక విధులు
శివకుమార్, సంతోష్ బెంగళూరులోని కోరమంగలో డ్యూటీ చెయ్యాలి. అయితే సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఇంటి దగ్గర బందోబస్తులో ఉండాలని పై అధికారులు ఆదేశాలు జారీ చెయ్యడంతో ఆర్ టీ నగర్ లోని ముఖ్యమంత్రి ఇంటి దగ్గర విధులు నిర్వహిస్తున్నారు. కోరమంగల పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న సమయంలోనే శివకుమార్, సంతోష్ కు డ్రగ్స్ పెడ్లర్స్, డ్రగ్స్ డీలర్స్ తో పరిచయం పెంచుకున్నారు.

డ్రగ్స్ డీలర్స్ తో టచ్ లో ఉన్న కిలాడీ పోలీసులు
అఖిల్ రాజ్, అహమ్మద్ అనే డ్రగ్స్ డీలర్స్ తో కానిస్టేబుల్స్ శివకుమార్, సంతోష్ కు ముందు నుంచి పరిచయం ఉంది. సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఇంటి దగ్గర విధులకు హాజరౌతున్న కానిస్టేబుల్స్ సంతోష్, శివకుమార్ కు డ్రగ్స్ డీలర్స్ అహమ్మద్, అఖిల్ రాజ్ టచ్ లో ఉన్నారు.

సీఎం ఇంటి ముందే డ్రగ్స్ డీలర్స్ మీద దాడి
సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఇంటి ముందు అఖిల్ రాజ్, మహమ్మద్ మీద కానిస్టేబుల్స్ శివకుమార్, సంతోష్ దాడి చేస్తున్న సమయంలో గస్తీ తిరుగుతున్న ఆర్ టీ నగర్ పోలీసులు చూశారు. ఎందుకు సీఎం ఇంటి దగ్గర ఇద్దరి మీద దాడి చేస్తున్నారని ఆర్ టీ నగర్ పోలీసులు ఆరా తీశారు. ఆ సమయంలో అసలు మ్యాటర్ తెలిసి పోలీసు అధికారులు బిత్తరపోయారు.

డబ్బులు అడిగినందుకు దాడి చేసి బుక్కైపోయిన పోలీసులు
డ్రగ్స్ డీలర్స్ మహమ్మద్, అఖిల్ రాజ్ దగ్గర గంజాయి తీసుకుని వేరే వాళ్లకు విక్రయిస్తున్న కానిస్టేబుల్స్ శివకుమార్, సంతోష్ డబ్బులు అడిగినందుకు వారి మీద దాడి చేశారని తెలుసుకున్న పోలీసు అధికారులు బిత్తరపోయారు. సీఎం ఇంటి దగ్గరే ఉంటున్న పోలీసులు గంజాయి విక్రయిస్తున్నారని వెలుగు చూడటం ఐటీ హబ్ లో కలకలం రేపింది. ఇటీవలే అల్లు అర్జున్ నటించిన పుష్పా సినిమా టైపులో ఆ సినిమాకు పోటీగా ఇద్దరు పోలీసులు గంధం చెక్కలు విక్రయిస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications