• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Honeytrap: వ్యాపారితో ప్రియా సరసాలు, నా భార్యతో బెడ్ రూమ్ లో ఏం చేస్తున్నావురా ? !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పాల బూత్ నిర్వహిస్తున్న యువకుడు జోరుగా వ్యాపారం చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఓ యువతి ఆ వ్యాపారికి పరిచయం అయ్యింది. కొంతకాలం తరువాత ఫోన్ నెంబర్లు మార్చుకున్న ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. రానురాను సెక్స్ జోకులు వేసుకుంటున్న ఇద్దరూ పిచ్చపాటిగా మాట్లాడుకుంటు మనసులో కోరికలు తీర్చుకుంటున్నారు. తన ఇంటికి వస్తే నీకు స్వర్గం చూపిస్తానని ఆ యువతి చెప్పింది. పాల వ్యాపారి ఎగేసుకుంటూ ఆమె ఇంటికి వెళ్లి పోయాడు. గంట తరువాత వ్యాపారికి కిలాడీ లేడీ నిజంగానే స్వర్గం చూపించడంతో అతను బిత్తరపోయాడు.

Wife: మొగుడు అమాయకుడు, కంత్రీ పెళ్లానికి కన్నింగ్ ప్రియుడు, షీలా డ్రామాకు క్లైమాక్స్, స్కెచ్ తో !Wife: మొగుడు అమాయకుడు, కంత్రీ పెళ్లానికి కన్నింగ్ ప్రియుడు, షీలా డ్రామాకు క్లైమాక్స్, స్కెచ్ తో !

 బెంగళూరులో పాల బూత్

బెంగళూరులో పాల బూత్

బెంగళూరులో 32 ఏళ్ల వయసు ఉన్న అరుణ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పాల బూత్ (మిల్క్ సెంటర్ )నిర్వహిస్తున్న అరుణ్ జోరుగా వ్యాపారం చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. గత సంవత్సరం సోషల్ మీడియాలో ప్రియా అలియాస్ హలీమా సాదియా అనే యువతి పాల వ్యాపారి అరుణ్ కు పరిచయం అయ్యింది.

 సెక్స్ జోకులు వేసుకుంటూ ఎంజాయ్

సెక్స్ జోకులు వేసుకుంటూ ఎంజాయ్

తన పేరు ప్రియా అని అరుణ్ ను నమ్మించిన హలీమా సాదియా అతన్ని వలలో వేసుకుంది. కొంతకాలం తరువాత ఫోన్ నెంబర్లు మార్చుకున్న అరుణ్, హలీమా మామూలుగా మాట్లాడుకుంటున్నారు. రానురాను సెక్స్ జోకులు వేసుకుంటున్న అరుణ్, హలీమా పిచ్చపాటిగా మాట్లాడుకుంటు మనసులో కోరికలు పైపైన తీర్చుకున్నారు.

 మా ఇంట్లో ఎవ్వరూ లేరు వచ్చేయ్

మా ఇంట్లో ఎవ్వరూ లేరు వచ్చేయ్

మా ఇంట్లో అందరూ ఊరికి వెళ్లారని, నేను ఒక్కటే ఉన్నానని హలీమా అలియాస్ ప్రియా పాల వ్యాపారి అరుణ్ కు ఫోన్ చేసి చెప్పింది. తన ఇంటికి వస్తే నీకు స్వర్గం చూపిస్తానని హలీమా పాల వ్యాపారి అరుణ్ కు చెప్పింది. పాల వ్యాపారి అరుణ్ ఎగేసుకుంటూ హలీమా చెప్పిన గుర్రప్పనపాళ్యలోని ఆమె చెప్పిన ఇంటి దగ్గరకు కారులో వెళ్లి పోయాడు.

 మంచి మూడ్ లో ఎంట్రీ

మంచి మూడ్ లో ఎంట్రీ

హలీమాతో బెడ్ రూమ్ లోకి వెళ్లిన అరుణ్ ఆమెతో సరసాలు ఆడటం మొదలు పెట్టాడు. ఆ సందర్బంలో ఇంట్లోకి జాహిద్ ఖురేషి, సయ్యద్, ఫర్హాన్ ఖాన్, ఇస్మాయిల్ అనే యువకులు ఎంట్రీ ఇచ్చారు. అరుణ్, హలీమా బెడ్ రూమ్ లో ఉన్న వీడియోలు, ఫోటోలు చకచకా తీసేశారు. మంచి రసపట్టులో ఉన్న వ్యాపారి అరుణ్ వాళ్లను చూసి షాక్ అయ్యాడు.

 నా భార్యతో బెడ్ రూమ్ లో ఏం చేస్తున్నావు రా ?

నా భార్యతో బెడ్ రూమ్ లో ఏం చేస్తున్నావు రా ?

నువ్వు నా భార్యతో ఏం చేస్తున్నావురా అంటూ జాహిద్ అనే వ్యక్తి రెచ్చిపోయి అరుణ్ మీద దాడి చేశాడు. ఈ వీడియోలు బయటకు రాకుండా ఉండాలంటే రూ. 3 లక్షలు ఇవ్వాలని హలీమాతో పాటు నిందితులు అందరూ అరుణ్ ను బెదిరించారు. అరుణ్ దగ్గర ఉన్న రూ. 26 వేలు లాక్కొన్నారు. అరుణ్ స్నేహితుడికి ఫోన్ చేసి రూ. 25 వేలు గూగుల్ పే చేయించకుని ఆ నగదు హలీమాకు ఫోన్ పే చేశాడు.

 వ్యాపారి నిలువు దోపిడి

వ్యాపారి నిలువు దోపిడి

పాల వ్యాపారి అరుణ దగ్గర ఉన్న బంగారు ఉంగరం లాక్కొన్నారు. కిలాడీ లేడీ హలిమాతో పాటు అందరూ కలసి అరుణ్ మీద దాడి చేసి అతని కారులోనే పరారైనారు. కొంత సేపటి తరువాత అరుణ్ కు ఫోన్ చేసి నీ కారు నీకు కావాలంటే రూ. 60 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. హడలిపోయిన అరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 కిలాడీ లేడీ హలీమా కహానీ

కిలాడీ లేడీ హలీమా కహానీ

కారులో వెలుతున్న కిలాడీ లేడీ హలిమాతో పాటు నిందితులు అందరిని సుద్దగుంటపాళ్య పోలీసులు అరెస్టు చేశారు. హలిమా, ఆమె గ్యాంగ్ ఇంకా ఎంతమందిని హనీట్రాప్ తో ఇలా నిలువు దోపిడీ చేసింది అని ఆరా తీస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఇటీవల బెంగళూరులో హైకోర్టు ఉద్యోగి కూడా హనీట్రాప్ తో మోసపోయిన విషయం తెలిసిందే.

English summary
Khiladi lady: Honeytrap case accused arrested in Bengaluru city in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X