Khiladi wife: నా భార్య ఆడది కాదు, బ్రహ్మరాక్షసి, శారీరకంగా హింస, డెత్ నోట్ రాసి, రెండేళ్లకు లేడి !
నాగౌర్/ జైసల్మేర్/జైపూర్: భారత సైన్యంలోని ఇంటెలిజెన్స్ విభాగంలో ఉద్యోగం చేస్తున్న యువకుడికి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. తెలిసినవాళ్లు అతనికి ఓ చెత్త సంబంధం చూశారు. ఈ అమ్మాయి చాలా మంచిదని, జీవితాంతం మీరు వెతికినా ఇలాంటి అమ్మాయి మీకు చిక్కదని, మీరు ఎంతో పుణ్యం చేసుకోవడంతో ఇలాంటి అమ్మాయి మీకు కోడలిగా చిక్కిందని అతని కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పారు. మూడు సంవత్సరాల క్రితం ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న యువకుడికి ఆమెతో వివాహం జరిగింది. భార్యతో సంతోషంగా కాపురం చెయ్యడానికి సెలవుల మీద సైనికుడు ఇంటికి వెళ్లాడు. అంతే అక్కడ నేను పెళ్లి చేసుకున్నది అమ్మాయిని కాదని, బ్రహ్మరాక్షసిని అని అతనికి తెలిసింది. తన భార్య తనను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తోందని, ఈ నరకం నేను తట్టుకోలేనని డెత్ నోట్ రాసి పెట్టిన సైనికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తరువాత అతను చనిపోయాడు. భర్త ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి నుంచి అతని భార్య తప్పించుకుని తిరుగుతోందని. గ్రహాలు మొత్తం రివర్స్ కావడంతో సైనికుడు ఆత్మహత్య చేసుకున్న రెండు ఏళ్ల తరువాత అతని భార్య పోలీసులకు అడ్డంగా చిక్కిపోయింది.

ఆర్మీలో ఉద్మోగం
రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ధనరామ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ధనరామ్ కుమారుడు సందీప్ కుమార్ (25) భారత సైన్యంలో ఇంటిలిజెన్స్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. సందీప్ కుమార్ కు వివాహం చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనేక పెళ్లి సంబంధాలు చూశారు. ఆర్మీలో మంచి ఉద్యోగం చేస్తున్న సందీప్ కుమార్ కు అనేక పెళ్లి సంబంధాలు వచ్చాయి.

మధ్యవర్తులకు మస్కా కొట్టిన అమ్మాయి కుటుంబ సభ్యులు
నాగౌర్ లో సంగీత అనే యువతి నివాసం ఉంటున్నది. సంగీతను సందీప్ కుమార్ కు ఇచ్చి వివాహం చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. అనుకున్నట్లే సందీప్ కుమార్ కు తెలిసిన వారికి సంగీత కుటుంబ సభ్యులు మస్కా కొట్టారు. తరువాత మధ్యవర్తులు సందీప్ కుమార్ తండ్రి ధనరామ్ ను కలిశారు.

మీ జీవితంలో ఇలాంటి అమ్మాయి చిక్కదు..... త్వరపడండి
తెలిసినవాళ్లు ధనరామ్ కుమారుడు సందీప్ కుమార్ కు సంగీత లాంటి ఓ చెత్త సంబంధం చూశారు. సంగీత చాలా మంచిదని, జీవితాంతం మీరు వెతికినా ఇలాంటి అమ్మాయి మీకు ఎక్కడా చిక్కదని, మీరు ఎంతో పుణ్యం చేసుకోవడంతో ఇలాంటి అమ్మాయి మీకు కోడలిగా చిక్కిందని సందీప్ కుమార్ తండ్రి ధనరామ్ కు, అతని కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పారు.

భార్యతో కాపురం చెయ్యాలని సెలవుల్లో వెళ్లిన సైనికుడు
సంగీత, సందీప్ కుమార్ కు వివాహం చెయ్యాలని పెద్దలు డిసైడ్ అయ్యారు. 2019 ఫిబ్రవరి 15వ తేదీన సందీప్ కుమార్, సంగీత వివాహం గ్రాండ్ గా జరిగింది. భార్య సంగీతతో సంతోషంగా కాపురం చెయ్యడానికి సందీప్ కుమార్ సెలవుల మీద ఇంటికి వెళ్లాడు. సరిగ్గా నెల రోజులు కూడా సంగీత ఆమె భర్త సందీప్ కుమార్ తో సంతోషంగా కాపురం చెయ్యలేదని తెలిసింది.

పుట్టింటికి చెక్కేసిన భార్య
వివాహం జరిగిన నెల రోజులకే సందీప్ కుమార్, సంగీత దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. చిన్నచిన్న విషయాలకు సంగీత ఆమె భర్త సందీప్ కుమార్, అతని కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టింది. వివాహం జరిగిన ఆరు నెలలకే సంగీత భర్త సందీప్ కుమార్ తో గొడవపడి నాగౌర్ లోని పుట్టింటికి వెళ్లిపోయింది.

నా భార్య ఆడదికాదు..... బ్రహ్మరాక్షసి
వివాహం జరిగిన ఆరు నెలలకే భార్య సంగీత పుట్టింటికి వెళ్లిపోవడంతో అవమానం భరించలేక సందీప్ కుమార్ ఆత్మహత్యా యత్నం చేశాడు. నేను పెళ్లి చేసుకున్న సంగీత ఆడది కాదని, బ్రహ్మరాక్షసి అని తెలిసిందని, తన భార్య తనను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తోందని, పడక గదిలో ఎవ్వరు లేని సమయంలో తనకు నరకం చూపించిందని, ఈ బాధలు నేను తట్టుకోలేనని డెత్ నోట్ రాసి పెట్టిన సైనికుడు సందీప్ కుమార్ ఆత్మహత్యా యత్నం చేయడం కలకలం రేపింది.

రెండేళ్లకు చిక్కిన కిలాడీ పెళ్లామ్
సందీప్ కుమార్ తండ్రి ధనరామ్ తన కొడుకు ఆత్మహత్యాయత్నానికి తన కోడలు సంగీత కారణం అని పోలీసు కేసు పెట్టారు. భర్త సందీప్ కుమార్ ఆత్మహత్యాయత్నం చేసిన తరువాత అతని భార్య సంగీత మాయం అయిపోయింది. తరువాత సందీప్ కుమార్ చనిపోయాడు. అప్పటి నుంచి సంగీత కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. గ్రహాలు మొత్తం రివర్స్ కావడంతో సైనికుడు సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న రెండు ఏళ్ల తరువాత అతని భార్య పోలీసులకు అడ్డంగా చిక్కిపోయింది.

మా ఇంటిని సర్వనాశనం చేసింది
మహిళా విభాగం క్రైమ్ ఇన్విస్టిగేషన్ డీఎస్పీ భవానీ సింగ్ సందీప్ భార్య సంగీతను విచారణ చేసి వివరాలు సేకరించారు. సంగీతను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచామని, కోర్టు ఆదేశాలతో ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. సందీప్ కుమార్ ఉద్యోగం చేస్తూ జీవితాంతం సంతోషంగా ఉంటాడని అనుకుని సంగీతతో పెళ్లి చేశామని, సంగీత మా ఇంట్లో అడుగు పెట్టి మా జీవితాలను సర్వనాశనం చేసిందని బాధితుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications