Khiladi lady: భర్త బిగ్ షాట్, భర్త ఫ్రెండ్ తో భార్య రొమాన్స్, భర్తకు స్లోపాయిజన్ ఇచ్చి !
ముంబాయి: వివాహం చేసుకున్న దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. భర్త ఓ గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఓనర్. భర్త స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. చాలా సంవత్సరాలు భార్య అక్రమ సంబంధం గురించి ఆమె భర్తకు తెలీలేదు. భర్త ఆస్తి లాక్కోవాలని అనుకున్న భార్య ఆమె భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేసింది. ప్రముఖ వ్యాపారి హత్య కేసులో అతని భార్య, మేడమ్ ప్రియుడు అరెస్టు అయ్యారు. హత్య చేసి తప్పించుకున్న భార్య, ఆమె ప్రియుడు చాలా రోజుల తరువాత పోలీసులకు చిక్కారు.

గార్మెంట్స్ ఫ్యాక్టరీ యజమాని
ముంబాయిలో కమల్ కాంత్ షా అనే వ్యాపారి నివాసం ఉంటున్నాడు .కొన్ని సంవత్సరాల క్రితం కవితా షా అలియాస్ కవితా (46)ను కమల్ కాంత్ పెళ్లి చేసుకున్నాడు. దంపతులకు 20 ఏళ్ల కుమార్తె, 17 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కమల్ కాంత్ కు సొంతంగా గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఉంది. కమల్ కాంత్ స్నేహితుడు హితేష్ జైన్ (46) అనే స్నేహితుడు ఉన్నాడు.

భర్త ఫ్రెండ్ తో కిలాడీ లేడీ రొమాన్స్
కమల్ కాంత్ గార్మెంట్స్ ఫ్యాక్టరీతో పాటు అతని వ్యాపారాలను హితేష్ జైన్ చూసుకుంటున్నాడు. కమల్ కాంత్ ఇంటికి వెళ్లి వస్తున్న హితేష్ జైన్ స్నేహితుడు భార్య కవితా షాను లైన్ లో పెట్టాడు. 10 సంవత్సరాల నుంచి కవితా షా ఆమె భర్త స్నేహితుడు హితేష్ జైన్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో రొమాన్స్ చేస్తోంది.

ఆస్తి కోసం భర్తకు స్లోపాయిజన్
భర్త కమల్ కాంత్ ఆస్తి లాక్కొని ప్రియుడు హితేష్ జైన్ తో జీవితాంతం సుఖంగా ఉండాలని కవితా షా ప్లాన్ వేసింది. కొన్ని నెలల నుంచి కవితా షా ఆమె భర్త కమల్ కాంత్ తీసుకుంటున్న ఆహారంలో, జ్యూస్ లో స్లోపాయిజన్ కలిపి ఇస్తోంది. రెండు నెలల నుంచి కమల్ కాంత్ తీవ్ర అనారోగ్యానికి గురైనాడు.

భర్త ప్రాణం పోయింది
స్లో పాయిజన్ దెబ్బకు కమల్ కాంత్ శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతిని 20 రోజుల క్రితం చనిపోయాడు. వ్యాపారి కమల్ కాంత్ అనారోగ్యంతో చనిపోయాడని అతని భార్య కవితా షా అందరిని నమ్మించింది. అయితే కమల్ కాంత్ సోదరి కవితా లాల్వాని పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కధ మలుపు తిరిగింది.

భార్య, ప్రియుడికి 70 ఎంఎం సినిమా
భర్త కమల్ కాంత్ కు అతని భార్య కవితా షా స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కమల్ కాంత్ హత్య కేసులో అతని భార్య కవితా షా, ఆమె ప్రియుడు హితేష్ జైన్ ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. తన భర్త కమల్ కాంత్ కు తాను సోపాయిజన్ ఇచ్చి హత్య చేశానని కవితా షా అంగీకరించిందని ముంబాయి పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications