వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Khiladi lady: వీడియో కాల్, బెడ్ రూమ్ రొమాన్స్ వీడి జీవితానే మార్చేసింది, ఆంటీ ఎంట్రీ, క్లైమాక్స్ లో !

|
Google Oneindia TeluguNews

అహమ్మదాబాద్: ఓ వ్యక్తి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓ రోజు ఆ వ్యక్తికి వీడియా కాల్ వచ్చింది. ఫోన్ ఆన్ చేసిన వ్యక్తి షాక్ అయ్యాడు. ఎదురుగా అందంగా ఉన్న మహిళ దర్శనం ఇచ్చింది. అయ్యో సారి అండి, ఎవరికో ఫోన్ చెయ్యాల్సింది మీకు వీడియో కాల్ వచ్చేసింది అని చెప్పిన మహిళ ఫోన్ కట్ చేసింది. తరువాత ఆమె మరోసారి అతనికి వీడియో కాల్ చేసింది. ఆ రోజు సేమ్ డైలాగ్ చెప్పింది. తరువాత మరోసారి ఫోన్ చేసిన లేడీ అప్పటి నుంచి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని, మంచి అమ్మాయి ఉంటే చూడండి అంటూ అతను ఫోన్ లో పరిచయం అయిన మహిళకు చెప్పాడు. మా ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తానని, మొదట నువ్వు వచ్చి చూసి తరువాత మీ కుటుంబ సభ్యులను పిలుచురావాలని ఆమె చెప్పింది. అతను ఒక్కడే ఊపుకుంటూ ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆమె తప్పా ఎవ్వరూ లేరు. కొంతసేపటి తరువాత ఆ వ్యక్తిని ఆమె ముగ్గులోకి దింపింది. బెడ్ రూమ్ లో మంచి రసపట్టులో ఉన్న సమయంలో ఆంటీ, అంకుల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో నగ్నంగా ఉన్న యువకుడి ఫోటోలు, వీడియోలు తీసిన దంపతులు అతన్ని బ్లాక్ మెయిల్ చేసి అతని నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. తరువాత పదేపదే ఆ వ్యక్తులు నగ్నంగా ఉన్న వీడియో, ఫోటోలు అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడం, అతను పోలీసులను ఆశ్రయించడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

Illegal affair: నేరుగా ఇంటికే వస్తున్న ప్రియుడు, పెళైన ఆరు నెలలకే, భర్త స్కెచ్ తో ఫినిష్!Illegal affair: నేరుగా ఇంటికే వస్తున్న ప్రియుడు, పెళైన ఆరు నెలలకే, భర్త స్కెచ్ తో ఫినిష్!

 పెళ్లి చేసుకోవాలని అమ్మాయి చూస్తున్నాడు

పెళ్లి చేసుకోవాలని అమ్మాయి చూస్తున్నాడు

గుజరాత్ లోని అహమ్మదాబాద్ సమీపంలోని జామ్ నగర్ లో 34 ఏళ్ల వయసు ఉన్న సూరజ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని సూరజ్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. సూరజ్ తల్లిదండ్రులు, అతని బంధువులు చాలా మంది పెళ్లి కూతురి కోసం సంబంధాలు చూస్తున్నారు.

 వీడియో కాల్ చేసిన కిలాడీ లేడీ

వీడియో కాల్ చేసిన కిలాడీ లేడీ

మూడు నెలల క్రితం ఓ రోజు సూరజ్ కు వీడియా కాల్ వచ్చింది. ఫోన్ ఆన్ చేసిన సూరజ్ షాక్ అయ్యాడు. ఎదురుగా అందంగా ఉన్న మహిళ దర్శనం ఇచ్చింది. అయ్యో సారీ అండి, ఎవరికో ఫోన్ చెయ్యాల్సింది మీకు వీడియో కాల్ వచ్చేసింది అని సూరజ్ కు చెప్పిన మహిళ ఫోన్ కట్ చేసింది. తరువాత రెండు రోజులకు ఆమె మరోసారి సూరజ్ కు వీడియో కాల్ చేసింది. ఆ రోజు కూడా సారీ అండి ఎవరికో ఫోన్ చెయ్యాల్సింది పొరపాటును మీకు ఫోన్ చేశాను అంటూ సూరజ్ కు సేమ్ డైలాగ్ చెప్పింది.

 నా పేరు జీనత్....నేను ?

నా పేరు జీనత్....నేను ?

మరోసారి ఫోన్ చేసిన లేడీ నా పేరు జీనత్ అండి, ఎందుకో ఎవరికో ఫోన్ చేస్తే మీకు కనెక్ట్ అవుతోందని సూరజ్ కు చెప్పింది. అప్పటి నుంచి జీనత్, సూరజ్ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని, మంచి అమ్మాయి ఉంటే చూడండి అంటూ సూరజ్ అతనికి ఫోన్ లో పరిచయం అయిన జీనత్ అనే మహిళకు చెప్పాడు.

 ముగ్గులోకి దింపిన కిలాడీ లేడీ

ముగ్గులోకి దింపిన కిలాడీ లేడీ

మా ఇంట్లో మీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తానని, మొదట నువ్వు వచ్చి చూసి తరువాత మీ కుటుంబ సభ్యులను పిలుచురావాలని జీనత్ ఫోన్ ఫ్రెండ్ సూరజ్ కు చెప్పింది. నవంబర్ 15వ తేదీన సాయంత్రం సూరజ్ ఒక్కడే ఊపుకుంటూ అనంతపురంలోని జీనత్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో జీనత్ తప్పా ఎవ్వరూ లేరు. కొంతసేపటి తరువాత జీనత్ ఇంటికి వచ్చిన సూరజ్ తో చనువుగా మాట్లాడుతూ అతన్ని ముగ్గులోకి దింపింది.

 బెడ్ రూమ్ లో రొమాన్స్ చేస్తూ ఉంటే ?

బెడ్ రూమ్ లో రొమాన్స్ చేస్తూ ఉంటే ?

గంట తరువాత సూరజ్ కూడా ప్రోసీడ్ అయిపోయి జీనత్ తో ఆమె ఇంట్లోని బెడ్ రూమ్ లో మంచి రసపట్టులో ఉన్న సమయంలో ఓ ఆంటీ, అంకుల్ ఎంట్రీ ఇచ్చారు. అంతే నగ్నంగా ఉన్న సూరజ్ కు ఏం చెయ్యాలో అర్థం కాక బిత్తరపోయాడు. వీళ్లు నా భర్త తల్లిదండ్రులు అని జీనత్ బెడ్ రూమ్ లో నగ్నంగా ఉన్న సూరజ్ కు చెప్పింది.

 రూ. 4 లక్షలు ఇస్తావా ? రేప్ కేసు పెట్టమంటావా

రూ. 4 లక్షలు ఇస్తావా ? రేప్ కేసు పెట్టమంటావా

బెడ్ రూమ్ లో సూరజ్ నగ్నంగా ఉన్న సమయంలో అతను నగ్నంగా ఉన్న ఫోటోలు, వీడియోలు తీసిన ఆంటీ, అంకుల్ మాకు రూ. 4 లక్షలు ఇవ్వకుంటే మా కోడిని రేప్ చేశావని కేసు పెడుతామని బెదిరించారు. నా దగ్గర అంత డబ్బులు లేవని సూరజ్ కుయ్యో మర్రో అన్నారు. అవన్ని మాకు తెలీవు నువ్వు డబ్బులు ఇవ్వకుంటే నిన్ను ఇక్కడి నుంచి కదలనివ్వమని జీనత్ తో పాటు ఆమె అత్తమామలు అని చెప్పుకున్న ఆంటీ, అంకుల్ బెదిరించారు.

 కిలాడీల దెబ్బతో బిత్తరపోయాడు

కిలాడీల దెబ్బతో బిత్తరపోయాడు

సూరజ్ ను బ్లాక్ మెయిల్ చేసిన జీనత్ కుటుంబ సభ్యులు సూరజ్ దగ్గర ఉన్న డబ్బు, అతని స్నేహితుల దగ్గర ఫేన్ పే చేయించుకుని మొత్తం రూ. 1.50 లక్షలు వసూలు చేశారు. తరువాత వారం లోపు రూ. 2.50 లక్షలు ఇవ్వాలని, లేదంటే నీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని సూరజ్ కు వార్నినంగ్ ఇచ్చి అతన్ని అక్కడి నుంచి పంపించేశారు.

 రూ. 1.50 లక్షలు స్వాహా.... మరో రూ. 2.50 లక్షల కోసం ?

రూ. 1.50 లక్షలు స్వాహా.... మరో రూ. 2.50 లక్షల కోసం ?

పదేపదే ఆ వ్యక్తులు నగ్నంగా ఉన్న వీడియో, ఫోటోలు అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడంతో హడలిపోయిన సూరజ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు జీనత్ తో పాటు ఆంటీ, అంకుల్ ను అరెస్టు చేశారు. నిందితులు ఇంకా ఎంత మంది జీవితాలతో ఇలా చెలగాటం ఆడుకున్నారు ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారలు తెలిపారు.

English summary
Khiladi lady: Youth falls into video call trap of blackmailers loses over Rs 1lakh in Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X