Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Khiladi: రూ. లక్షల్లో జీతాలు వస్తాయని ?, అమ్మాయిలను అమ్మేస్తున్న దంపతులు, ఐటీ హబ్ లో డీల్!

చెన్నై/బెంగళూరు/ త్రిపుర: ప్రముఖ సిటీలోని ఆసుపత్రులు, బ్యూటీపార్లల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అందంగా ఉన్న అమ్మాయిల కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పారు. మొదట వేలల్లో జీతాలు ఇస్తారని, తరువాత లక్షల్లో జీతాలు వస్తాయని అమ్మాయిల కుటుంబ సభ్యులకు తియ్యటి మాటలు చెప్పారు. అమ్మాయిలను నమ్మించి తీసుకు వచ్చిన దంపతులు వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలతో లింక్ పెట్టుకున్న దంపతులు ఆ అమ్మాయిలను వారికి విక్రయిస్తున్నారు.

ఎదురు తిరుగుతున్న అమ్మాయిలను కర్రలు, బెల్ట్ లతో దాడి చేసి నరకం చూపిస్తున్నారు. నలుగురు మైనర్ అమ్మాయిలను హైటెక్ వేశ్యవాటిక కేంద్రాలు నిర్వహిస్తున్న ముఠాకు విక్రయించడానికి డీల్ మాట్లాడుకున్నారు. ఒక సిటీ నుంచి మరో సిటీకి అమ్మాయిలను తరలించడానికి రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జ్ లో మకాం వేశారు. పక్కాసమాచారం అందడంతో పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. అమ్మాయిలు దంపతుల దగ్గరకు అప్పగించిన మరో ఇద్దరు మధ్యవర్తులు తప్పించుకోవడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐటీ హబ్ లోని హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహకులు కూడా తప్పించుకున్నారు.

త్రిపురా కిలాడీ దంపతులు

త్రిపురా కిలాడీ దంపతులు

త్రిపురాలో అన్వర్ హుస్సేన్, సలీమా కథూన్ (38) దంపతులు నివాసం ఉంటున్నారు. చూడటానికి అమాయకురాలిగా కనపడుతున్న సలీమా ఆమె భర్తతో కలిసి కష్టపడకుండా ఉద్దరగా డబ్బులు సంపాధించాలని స్కెచ్ వేసింది. అందంగా ఉన్న అమాయకులైన అమ్మాయిల కుటుంబ సభ్యులను సలీమా, అన్వర్ హుస్పేన్ దంపతులు టార్గెట్ చేసుకున్నారు.

అన్నదమ్ములు ఎంట్రీ

అన్నదమ్ములు ఎంట్రీ

అగర్తాలకు చెందిన అల్లావుద్దీన్ (23), మైనుద్దీన్ (26) సోదరులు సలీమాకు పరిచయం ఉన్నారు. చెన్నై సిటీలోని ఆసుపత్రులు, బ్యూటీపార్లల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అందంగా ఉన్న అమ్మాయిల కుటుంబ సభ్యులకు సలీమా, అన్వర్, మైనుద్దీన్, అల్లావుద్దీన్ మాయమాటలు చెప్పారు. అందంగా ఉన్న అమ్మాయిలను చెన్నై పిలుచుకురావడానికి వీళ్లు పక్కాస్కెచ్ వేశారు.

రూ. లక్షల్లో జీతాలు వస్తాయని ఆశ పెట్టారు

రూ. లక్షల్లో జీతాలు వస్తాయని ఆశ పెట్టారు

మొదట వేలల్లో జీతాలు ఇస్తారని, తరువాత లక్షల్లో జీతాలు వస్తాయని సలీమా, అన్వర్, మైనుద్దీన్, అల్లావుద్దీన్ అమ్మాయిల కుటుంబ సభ్యులకు తియ్యటి మాటలు చెప్పారు. అమ్మాయిలను నమ్మించి చెన్నై తీసుకు వచ్చిన అన్వర్, సలీమా దంపతులు వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. బెంగళూరుతో పాటు వివిద నగరాల్లో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలతో లింక్ పెట్టుకున్న అన్వర్, సలీమా దంపతులు ఆ అమ్మాయిలను వారికి విక్రయిస్తున్నారు.

బెంగళూరు ముఠాతో డీల్

బెంగళూరు ముఠాతో డీల్

బెంగళూరులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలతో లింక్ పెట్టుకున్న అన్వర్, సలీమా దంపతులు ఆ అమ్మాయిలను వారికి విక్రయిస్తున్నారు. ఎదురు తిరుగుతున్న అమ్మాయిలను కర్రలు, బెల్ట్ లతో దాడి చేసి నరకం చూపిస్తున్నారు. 14, 15, 16, 17 ఏళ్ల వయసు ఉన్న నలుగురు మైనర్ అమ్మాయిలను బెంగళూరులో హైటెక్ వేశ్యవాటిక కేంద్రాలు నిర్వహిస్తున్న ముఠాకు విక్రయించడానికి డీల్ మాట్లాడుకున్నారు.

లాడ్జ్ సిబ్బందికి అనుమానం

లాడ్జ్ సిబ్బందికి అనుమానం

చెన్నై సిటీ నుంచి బెంగళూరు సిటీకి అమ్మాయిలను తరలించడానికి చెన్నైలోని కీలంబాక్కంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జ్ లో మకాం వేశారు. లాడ్జ్ లో అమ్మాయిలు ఎదురు తిరడంతో సలీమా, ఆమె భర్త అన్వర్ నలుగురు అమ్మాయిలను చితకబాదేశారు. ఆ సమయంలో అమ్మాయిలు కేకలు వెయ్యడంతో లాడ్జ్ సిబ్బందికి అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సీన్ మొత్తం రివర్స్ తో ఫినిష్

సీన్ మొత్తం రివర్స్ తో ఫినిష్

పక్కాసమాచారం అందడంతో చెన్నై సిటీ పోలీసులు, తమిళనాడు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు కీలంబాక్కంలోని లాడ్జ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. సలీమా, ఆమె భర్త అన్వర్ మమ్మల్ని బలవంతంగా విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని అమ్మాయిలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దెబ్బకు దంపతుల మైండ్ బ్లాక్

దెబ్బకు దంపతుల మైండ్ బ్లాక్

సలీమా, అన్వర్ ను అరెస్టు చేసిన పోలీసులు నలుగురు అమ్మాయిలను మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. ఇద్దరు మధ్యవర్తులు మైనుద్దీన్, అల్లావుద్దీన్ తప్పించుకోవడంతో వారి కోసం చెన్నై సిటీ పోలీసులు గాలిస్తున్నారు. ఐటీ హబ్ బెంగళూరులోని హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహకులు కూడా తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నామని చెన్నై సిటీ పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+