చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khiladi: ఇంజనీరింగ్ చదివాడు, కాలేజ్ అమ్మాయిలు టార్గెట్, చెన్నై చిన్నది ఏం చేసిందంటే ? దెబ్బకు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తిరుచ్చి: ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువకుడు మంచి ఉద్యోగం చేసి హ్యాపీగా జీవించాలని అతని కుటుంబ సభ్యులు కలలుకన్నారు. అయితే ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువకుడు మాత్రం వేరేదారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. సిటీలో ఉంటున్న దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు కాలేజ్ లో చదువుతోంది. కొడుక్కి పెళ్లి చెయ్యాలని పెళ్లి సంబంధాలు చేస్తున్నారు. దంపతుల ఇంట్లో ఉన్న 25 సవర్ల బంగారు నగలు, రూ. 2.50 లక్షల డబ్బు మాయం కావడంతో కుటుంబ సభ్యులు హడలిపోయారు. ఇంట్లో కూతురు మాత్రమే ఉండటం, బయటవాళ్లు ఎవ్వరూ రాకపోవడంతో ఆమె మీద తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది.

కూతురిని నిలదీసి నాలుగు దెబ్బలు వెయ్యడంతో కూతురు అసలు విషయం చెప్పింది. కూతురు ఇచ్చిన సమాచారంతో షాక్ అయిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన కేటుగాడి అసలు వ్యవహారం, అతను అమ్మాయిలతో ఎలా గేమ్స్ ఆడుతున్నాడు అనే మ్యాటర్ బయటకు వచ్చింది. అమ్మాయిలతో శారీరక సుఖం పొందడమే కాకుండా వాళ్లు నిలువు దోపిడీ చేస్తున్న యువకుడు లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడని తెలుసుకున్న పోలీసులు సైతం షాక్ అయ్యారు.

Illegal affair: ఫ్రెండ్ భార్యతో సీక్రేట్ రొమాన్స్, రెడ్ హ్యాండెడ్ గా చూసి స్పాట్ లో చంపేసిన భర్త, ఎస్కేప్ !Illegal affair: ఫ్రెండ్ భార్యతో సీక్రేట్ రొమాన్స్, రెడ్ హ్యాండెడ్ గా చూసి స్పాట్ లో చంపేసిన భర్త, ఎస్కేప్ !

 ఇంజనీరింగ్ చదివాడు

ఇంజనీరింగ్ చదివాడు

తమిళనాడులోని తిరుచ్చి నగరంలోని తిలై నగర్ కాశీపిళ్లై వీధిలో విశ్వ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన విశ్వ మంచి ఉద్యోగం చేసి హ్యాపీగా జీవించాలని అతని కుటుంబ సభ్యులు కలలుకన్నారు. అయితే ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత విశ్వ ఎలాంటి కష్టం లేకుండా ఎంజాయ్ చెయ్యాలని వేరేదారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

 సోషల్ మీడియా టార్గెట్

సోషల్ మీడియా టార్గెట్

ఇన్ స్టాగ్రామ్ తో పాటు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న విశ్వ అందమైన కాలేజ్ అమ్మాయిల కోసం వేట మొదలు పెట్టాడు. కాలేజ్ లో చదువుతున్న అమాయకులైన అమ్మాయిలకు సోషల్ మీడియాలో వల వేసిన విశ్వ వారిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటున్నానని మాయమాటలు చెప్పి వారికి దగ్గర అయ్యాడు.

 కాలేజ్ అమ్మాయి ఇంట్లో ?

కాలేజ్ అమ్మాయి ఇంట్లో ?

చెన్నై సిటీలోని పళవసంతంగల్ ఏరియాలో దంపతులు నివాసం ఉంటున్నారు, దంపతులకు కాలేజ్ లో చదువుతున్న 19 ఏళ్ల అమ్మాయితో పాటు 24 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కూతురు కాలేజ్ లో చదువుతోంది. కొడుక్కి పెళ్లి చెయ్యాలని పెళ్లి సంబంధాలు చేస్తున్నారు. దంపతుల ఇంట్లో ఉన్న 25 సవర్ల బంగారు నగలు, రూ. 2.50 లక్షల డబ్బు మాయం కావడంతో కుటుంబ సభ్యులు హడలిపోయారు.

 కూతురి మీద అనుమానం

కూతురి మీద అనుమానం

ఇంట్లో కూతురు మాత్రమే ఉండటం, బయటవాళ్లు ఎవ్వరూ రాకపోవడంతో ఆమె మీద తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. కూతురిని నిలదీసి నాలుగు దెబ్బలు వెయ్యడంతో కూతురు ఆమె ప్రియుడు తిరుచ్చి విశ్వ గురించి అసలు విషయం చెప్పింది. కూతురు ఇచ్చిన సమాచారంతో షాక్ అయిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

 కేటుగాడి స్కెచ్ తో షాక్

కేటుగాడి స్కెచ్ తో షాక్

కరోనా వైరస్ సెకండ్ వేవ్ సమయంలో తనకు విశ్వ పరిచయం అయ్యాడని, తరువాత ఇద్దరూ ప్రేమించుకున్నామని కాలేజ్ అమ్మాయి చెప్పింది. విశ్వ తన నగ్న ఫోటోలు, వీడియలో పంపించాలని చెప్పాడని, తరువాత ఆ ఫోటోలు అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేశాడని, అతని దెబ్బకు భయపడి ఇంట్లో ఉన్న 25 సవర్ల నగలు, రూ. 2.50 లక్షలు విశ్వకు ఇచ్చేశానని చెన్నై కాలేజ్ అమ్మాయి పోలీసులకు చెప్పింది.

 దెబ్బకు జైలుపాలైన కిలాడి

దెబ్బకు జైలుపాలైన కిలాడి

ఇంజనీరింగ్ పూర్తి చేసిన కేటుగాడు విశ్వ అసలు వ్యవహారం, అతను అమ్మాయిలతో ఎలా గేమ్స్ ఆడుతున్నాడు అనే మ్యాటర్ బయటకు వచ్చింది. అమ్మాయిలతో శారీరక సుఖం పొందడమే కాకుండా వాళ్ల నగ్న వీడియోలు, ఫోటోలు సేకరించి తరువాత బ్లాక్ మెయిల్ చేసి వాళ్లను నిలువు దోపిడీ చేస్తున్న విశ్వ లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడని తెలుసుకున్న పోలీసులు సైతం షాక్ అయ్యారు. విశ్వను అరెస్టు చేసిన పోలీసులు అతను అమ్మాయిలను మోసం చేసి లూటీ చేసిన నగలు, డబ్బుతో పాటు రెండు ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Khiladi: Trichy police have arrested a youth for throwing love nets at young women through Instagram and extorting money from them by taking pornographic pictures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X