చేదు అనుభవం: నటి ఖుష్బూపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి
Recommended Video

ఖుష్బూపై కోడిగుడ్లతో దాడి..పెళ్ళికి ముందు సెక్స్...!
చెన్నై: ప్రముఖ నటి ఖుష్బూకు గురువారం చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడులోని మెట్టూరు కోర్టుకు కారులో వెళ్తుండగా కొందరు వ్యక్తులు ఆమె వాహనంపై కోడి గుడ్లు, టమాటాలతో దాడి చేశారు.
2015లో ఆమె మహిళలను ఉద్దేశిస్తూ తప్పుడు వ్యాఖ్యలు చేశారని కొందరు కేసు వేశారు. ఆ కేసు నిమిత్తం ఆమె కోర్టుకు హాజరయ్యారు. ఆ కేసు కొనసాగుతోంది.

ఈ కేసు నేపథ్యంలో ఆమె కోర్టుకు వెళ్తుండగా దాడి జరిగింది. ఘటనపై తహసీల్దారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా దాడి చేయడం సరికాదన్నారు. దాడికి పాల్పడిన వారిలో 41 మంది వ్యక్తులను గుర్తించారు. మరోవైపు, ఖుష్బూ కేసును కోర్టు మార్చి 6కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications