కేజ్రీవాల్‌కు షాక్: బీజేపీలోకి కిరణ్ బేడీ, మోడీకి ప్రశంస (పిక్చర్స్)

న్యూఢిల్లీ: మాజీ ఐపీఎస్‌ అధికారిణి కిరణ్ బేడీ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఆమె ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.

సామాజిక కార్యకర్త అన్నా హాజారే నేతృత్వంలో ఒకప్పుడు ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్‌తో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పని చేసిన కిరణ్ బేడీ ఇప్పుడు ఆ పార్టీపైనే పోటీకి దిగనున్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లో 31 సీట్లు సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది.

ఆ తర్వాత అమ్‌ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని 49 రోజుల పాలించింది. తాజాగా ఎన్నికల కమిషన్‌ ఎన్నికల తేదీ ప్రకటించడంతో ఢిల్లీ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో కిరణ్ బేడీ బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సమక్షంలో గురువారం నాడు కమలతీర్థం పుచ్చుకున్నారు.

కిరణ్ బేడీ, అమిత్ షా, నరేంద్ర మోడీ

కిరణ్ బేడీ, అమిత్ షా, నరేంద్ర మోడీ

మాజీ ఐపీఎస్‌ అధికారిణి కిరణ్ బేడీ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరారు.

కిరణ్ బేడీ, అమిత్ షా

కిరణ్ బేడీ, అమిత్ షా

భారతీయ జనతా పార్టీ తరఫున కిరణ్ బేడీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

కిరణ్ బేడీ, అమిత్ షా

కిరణ్ బేడీ, అమిత్ షా

మాజీ ఐపీఎస్‌ అధికారిణి కిరణ్ బేడీ పార్టీలో చేరిన సమయంలో ఆమెకు పుష్పగుచ్ఛం ఇస్తున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా

కిరణ్ బేడీ, అమిత్ షా

కిరణ్ బేడీ, అమిత్ షా

మాజీ ఐపీఎస్‌ అధికారిణి కిరణ్ బేడీ పార్టీలో చేరిన సమయంలో ఆమెకు పుష్పగుచ్ఛం ఇస్తున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా

ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడారు. కిరణ్ బేడీని పార్టీలో ఆహ్వానిస్తున్నాన్నారు. ఆమె చేరికతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరనేది పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజాకాంక్షనెరవేర్చేందుకు బేడీ చేరిక దోహదం చేస్తుందని చెప్పారు.

కిరణ్ బేడీ మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాలుగా దేశసేవలో ఉన్నానని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ తనకు స్పూర్తి ప్రదాత అన్నారు. ఢిల్లీకి సుస్థిర, సాహసోపేత, నిజాయితీగల ప్రభుత్వం అవసరమని, తనపట్ల విశ్వాసంతో బీజేపీలో చేర్చుకున్నందుకు ప్రధాని మోడీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+