సోనియా కంటే ఆయనే పవర్ ఫుల్ - డీకే ను ఒప్పించిన గురూజీ, ఏం చెప్పారు..!!
డీకే శివకుమార్. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్న పేరు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించి..కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టిన వారిలో ముఖ్యనేత. ముఖ్యమంత్రి రేసులో సిద్దరామయ్య కు ..కాంగ్రెస్ హై కమాండ్ కు చివరి నిమిషం దాకా చెమటలు పట్టించారు. ముఖ్యమంత్రి పదవి కావాల్సిందేనని పట్టుబట్టారు. సోనియా, రాహుల్, ఖర్గే చెప్పినా ముందు ససేమిరా అన్నారు. కానీ, గురూజీ చెప్పిక ఒకే ఒక్క మాటతో డీకేను ఒప్పించారు. వెంటనే వ్యూహాత్మకంగా వెనుకడుగు వేసారు. సిద్దరామయ్యకు ఓకే చెప్పారు.
ఎట్టకేలకు డీకే అంగీకారం : కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యేందుకు డీకే శివకుమార్ చివరి నిమిషం వరకు పట్టుబట్టారు. ఢిల్లీలో అగ్ర నేతలు నచ్చ చెప్పినా ఒక దశలో వినలేదు. తనకు ఇవ్వాలని లేకుంటే సిద్దరామయ్యకు కాకుండో మరో నేతకు ఇవ్వాలని హైకమాండ్ ను ఇరుకున పెట్టారు. సోనియా, రాహుల్ చెప్పినా వెంటనే ఓకే చెప్పలేదు. తాను తొలి నుంచి నమ్మకం పెట్టుకున్న తన గురువు, రాజకీయ జ్యోతిష్కుడు అయిన వెల్లూర్ శివ శంకర్ నాయారణ ద్వారకానాధ్ గురూజీ తో నిరంతరం టచ్ లో ఉన్నారు. ఢిల్లీ పరిణామాల పైన జోతిష్య పరంగా గురూజీ సూచనలు సలహాలు తీసుకున్నారు. చివరకు గురూజీ చెప్పటంతోనే డీకే వెనక్కు తగ్గారని సమాచారం. మరో ఏడాది పదవి కోసం వేడి చూడాలని డిసైడ్ అయ్యారు.

గురూజీ మాటే శిరోధార్యం : డీకే శివకుమార్ కు పెద్ద ఎత్తున స్వామీజీలు..మఠాధిపతుల మద్దతు ఉంది. డీకే శివకుమార్ జాతకంలో ప్రస్తుతం రాజయోగం లేదని డిప్యూటీ సీఎం తీసుకోవాలని గురూజీ సూచించారు. దీని కారణంగానే అంతగా పట్టుబట్టిన శివకుమార్ సడన్ గా తన వైఖరి మార్చుకున్నారు. 2025 నవంబర్ కు గ్రహాలన్నీ డీకేకు అనుకూలంగా మారుతాయని, అప్పుడు సీఎం పదవి కోసం పోరాడాల్సిన అవసరం రాదని చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం పదవి దానంతట అదే వరిస్తుందని గురూజీ చెప్పారని సమాచారం. డీకేను డిప్యూటీ సీఎం పదవికి అప్పగించేందుకు అగ్ర నేతలు ప్రయత్నించినా, చివరకు గురూజీ చెప్పటంతోనే డీకే అంగీకరించారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
రాజకీయ గురూజీ : కేవలం డీకే శివకుమార్ కు మాత్రమే కాదు. గతంలో మాజీ సీఎంలు దేవరాజ్ ఉర్స్, ఎస్ఎం క్రిష్ణ, ధరంసింగ్, హెచ్ డీ కుమార స్వామి కూడా రాజకీయ , వ్యక్తిగతంగా కీలక నిర్ణయాల సమయంలో ద్వారకానాద్ గురూజీ సలహాలు తీసుకొని..ఆ సూచనల మేరకే అడుగులు వేసేవారు. ఇప్పుడు ఒక విధంగా ఈ స్వామీజీ ఇచ్చిన సలహాలతో డీకే శివకుమార్ హైకమాండ్ నిర్ణయానికి ఓకే చెప్పటం ద్వారా కాంగ్రెస్ నాయకత్వానికి పెద్ద రిలీఫ్ గా మారింది. కర్ణాటకలో రేపు సిద్దరామయ్య సీఎంగా.. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.












Click it and Unblock the Notifications