భార్య చంపిన కేసులో యావజ్జీవ శిక్ష, తప్పించుకుని లాడ్జ్ లో ప్రియురాలిని చంపేశాడు!
బెంగళూరు: భార్యను చంపిన కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తి పోలీసుల కళ్లుకప్పి చాకచక్యంగా తప్పించుకుని ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ప్రియురాలిని హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కర్ణాటకలోని కోలారుకు చెందిన శంకర్ (41) భార్యను దారుణంగా హత్య చేశాడు. భార్యను హత్య చేసిన కేసులో శంకర్ కు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విదించింది. అనారోగ్యంతో ఉన్న శంకర్ ను విక్టోరి ఆసుపత్రిలోని జైలు వార్డుకు తీసుకు వచ్చారు.

విక్టోరియా ఆసుపత్రి జైలు వార్డులో చికిత్స పొందుతున్న శంకర్ ఫిబ్రవరి 16వ తేదీ జైలు సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకున్నాడు. అనంతరం శంకర్ తన ప్రియురాలు రేణుకతో కలిసి మెజస్టిక్ సమీపంలోని సూర్య నెస్ట్ లాడ్జ్ కు వెళ్లాడు.
తాము దంపతులు అని, గది అద్దెకు ఇవ్వాలని లాడ్జ్ సిబ్బందికి మనవి చేసిన శంకర్ ఒక గది తీసుకున్నాడు. రెండు రోజులు అయినా గది నుంచి శంకర్, రేణుక బయటకు రాలేదు. అయితే ప్రియురాలు రేణుకను హత్య చేసిన శంకర్ అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. గదిలో నుంచి దుర్వాసన రావడంతో లాడ్జ్ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి గది తాళాలు పగలుగొట్టి చూడగా రేణుక హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి శంకర్ కోసం గాలిస్తున్నామని, త్వరలో అతన్ని పట్టుకుంటామని డీసీపీ చెన్నబసవన్నవర్ అన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications