వావ్.. యునెస్కొ వారసత్వ సాంస్కృతిక పండుగల జాబితాలో బెంగాల్ దుర్గా పూజ..మోడీ హర్షం
ఇటీవల రామప్ప ఆలయానికి యునెస్కోలో చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోల్ కతా దుర్గా పూజకు కూడా యునెస్కొలో స్థానం లభించింది. దుర్గా పూజకు యునెస్కొ సాంస్కృతిక పండుగల జాబితాలో గుర్తించింది. ఈ మేరకు ప్రకటించింది. దీంతో భారతవని ఆనందంతో ఉప్పొంగి పోయింది. ఇవాళ సుదినం అంటూ ప్రతీ ఒక్కరు తెగ ఆనందపడ్డారు.
దుర్గమ్మ అంటే పవర్ పుల్.. అమ్మవారిని నిష్టతో కొలవాలి. ఇప్పుడు అన్నీ చోట్ల.. ఊరురా దుర్గ మండపాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇదివరకు అయితే బెంగాల్‌లోనే నెలకొల్పేవారు. యావత్ దేశం అమ్మవారిని కొలిచేది.. ఆరాధించేది. ఇప్పడు అమ్మవారి పూజలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యునెస్కో గుర్తించడంతో ప్రపంచానికి అమ్మవారి గురించి తెలిసింది.

బెంగాల్ దుర్గా పూజకు దేశంలోనే అత్యంత ప్రశస్తి ఉంటుంది. నవ రాత్రుల్లో అక్కడ జరిగే దుర్గా పూజలు విశేష ప్రాచుర్యం పొందాయి. బెంగాల్ దుర్గాకు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఈ పూజకు యునెస్కో గుర్తింపు లభించింది. సాంస్కృతిక వారసత్వ పండుగల జాబితాలో దుర్గా పూజకు చోటు దక్కిందని యునెస్కో ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ అరుదైన చోటు దక్కడంతో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయం ప్రతి భారతీయుడికీ ఎంతో గర్వకారణమని, యునెస్కో జాబితాలో చోటు దక్కడం ఎంతో సంతోషకరమైన విషయం అని మోదీ పేర్కొన్నారు.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు. ఈ విషయం బెంగాలీలకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. తాము దుర్గా పూజను కేవలం పూజగా మాత్రమే నిర్వహించమని, అది ఓ భావనలాగా నిర్వహించుకుంటామని మమత పేర్కొన్నారు. వారు ఎంత.. నియమ, నిష్టలతో అమ్మవారిని కొలుస్తారో.. అలా అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది.












Click it and Unblock the Notifications