మమత బెనర్జీకి షాకిచ్చిన పోలీసులు: సుమోటోగా స్వీకరణ

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై కేసు నమోదైంది. కోల్‌కతా పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోల్‌కతా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై కోల్‌కతా హేస్టింగ్ పోలీస్ స్టేషన్ లో కొద్దిసేపటి కిందటే ఈ కేసు నమోదైంది. ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి దారి తీసింది. తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని మమత బెనర్జీ తప్పు పట్టారు.

శుక్రవారం కోల్‌కతాలోని క్యాథడ్రల్ రోడ్ లో మమత బెనర్జీ ఓ భారీ బహిరంగ సభను నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె న్యాయస్థానం విధించిన నిబంధనలను ఉల్లంఘించారనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో ఎంతటి వారినైనా వదలొద్దంటూ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు దీన్ని సుమోటోగా స్వీకరించారు. ఆమెపై బీఎన్ఎస్ లోని 61 (2), 223, 125 (ఎ), 132, 285 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Kolkata Police File Case Against Mamata Banerjee WBTMCP Over Alleged High Court Order Violation

తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాళీఘాట్ టీఎంసీ విభాగం క్యాథడ్రల్ రోడ్డులో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సభ నిర్వహణ కోసం కోల్‌కతా హైకోర్టు కొన్ని షరతులను ముందుగానే విధించింది. సభకు హాజరయ్యే వారి సంఖ్య 1,500 మందికి మించకూడదని, సాధారణ వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా రోడ్డుకు ఒక వైపు మార్గాన్ని పూర్తిగా ఖాళీగా ఉంచాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అర్ధరాత్రి మీ ఎమ్మెల్సీని ఎందుకు పార్టీ బహిష్కరించావ్: రాజాసింగ్ సూటి ప్రశ్న
అర్ధరాత్రి మీ ఎమ్మెల్సీని ఎందుకు పార్టీ బహిష్కరించావ్: రాజాసింగ్ సూటి ప్రశ్న

ఈ సభలో కోర్టు నిర్దేశించిన భద్రతా నిబంధనలన్నింటినీ తృణమూల్ కాంగ్రెస్ పక్కనబెట్టారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. న్యాయస్థానం నిర్దేశించిన పరిమితి కంటే చాలా రెట్లు ఎక్కువగా జనం సభకు తరలివచ్చారు. దీనివల్ల క్యాథడ్రల్ రోడ్డులో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రసంగ సమయంలో మమతా బెనర్జీ చేసిన సూచనల వల్ల రోడ్డుకు అవతలి వైపు చెట్ల కింద ఉన్న జనం కూడా ఒక్కసారిగా బారికేడ్లను తోసుకుంటూ వేదిక వైపు దూసుకొచ్చారు.

సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లల్లో వాటికి ఎండ్ కార్డ్: ఐఐటీ- హెచ్ మాస్టర్ ప్లాన్
సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లల్లో వాటికి ఎండ్ కార్డ్: ఐఐటీ- హెచ్ మాస్టర్ ప్లాన్

దీనివల్ల బస్సులు, ఇతర వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. దీనిపై సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడాన్ని ఆయన తప్పుపట్టారు. సాధారణ వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలగకుండా రోడ్డు పక్కన మాత్రమే సభ నిర్వహించుకోవాలని కోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ, నియమ నిబంధనలను ఉల్లంఘించారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+