చేతులు కాలాకా .. కోల్‌కతా స్కూల్ టాయలెట్ల వద్ద రిజిస్టార్ .. ఎందుకో తెలుసా ?

కోల్‌కతా : ఏదైనా ఘటన జరిగిన తర్వాత మన పాలకులు కళ్లు తెరుస్తారు. ఇది సహజం. కానీ తర్వాత మరచిపోతారు. జాగ్రత్తల సోయి ఉండదు. దీంతో సమస్య వచ్చింది. ఇటీవల కోల్‌కతాలో ఓ స్కూల్‌ టాయిలెట్‌లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. దీంతో మిగతా విద్యాసంస్థలు కళ్లు తెరిచాయి. విద్యార్థులనే డేగ కళ్లతో పర్యవేక్షిస్తామని బీరాలు పలుకుతుంది.

అలర్ట్ .. అలర్ట్ ...
ఇటీవల కోల్‌కతా స్కూల్ బాత్రూంలో ఓ స్టూడెంట్ బలవన్మరణానికి పాల్పడటంత మిగతా విద్యాసంస్థలు అప్రమత్తమయ్యాయి. విద్యార్థుల ప్రతీ చర్యను నిశీతంగా గమనించాలని నిర్ణయించుకున్నాయి. తమ పాఠశాలలో జూలై 1 నుంచి టాయిలెట్ల వద్ద రిజిస్టర్ పెడతామని పేర్కొంది. అంటే ఏ విద్యార్థి టాయిలెట్ వెళ్తున్నాడు ? ఎంత సమయం ఉంటున్నాడు ? బయటకు ఎప్పుడు వస్తున్నాడు ? వెళ్లే సమయం, వచ్చే సమయం రిజిస్ట్రార్‌లో తప్పనిసరిగా నోట్ చేస్తామని సౌత్ సిటీ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం తెలిపిందని టెలీగ్రాఫ్ రిపోర్ట్ చేసింది.

Kolkata school to time students bathroom breaks after shocking suicide

డేగకళ్లతో పర్యవేక్షణ ..

ఈ కొత్త చర్యతో విద్యార్థులు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే తెలిసిపోతుందని యాజమాన్యం తెలపింది. వాస్తవానికి వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించాలనుకున్నామని .. కానీ విద్యార్థునులు, విద్యార్థిల వాష్ రూం వద్ద రికార్డు చేసేందుకు తమక సిబ్బది అవసరమవుతారని .. అందేకు ఆలస్యమైందన్నారు. దీంతో ఏమైనా అనుకోని ఘటన జరిగితే వెంటనే తెలిసిపోతుందని ప్రిన్సిపాల్ జాన్ బాగుల్ తెలిపారు. గతవారం ఓ పాఠశాలలో విద్యార్థిని స్కూల్ బాత్ రూంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ బ్యాగ్‌తో మొహనికి చుట్టుకొని కనిపించింది. అయితే ఆమె చేతిపై గాయాలు కనిపించడంతో ఆత్మహత్యనా ? హత్యనా అనే అనుమానాలు కలిగాయి. దీంతో మిగతా విద్యాసంస్థలు కూడా అలర్టయ్యాయి. తమ స్కూళ్లలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తాము తీసుకుంటున్న ఈ చర్యలు కేవలం విద్యార్థుల శ్రేయస్సు కోసమేనని చెప్తున్నాయి. అంతేకాదు దీనిపై టీచర్లు .. విద్యార్థుల ఇళ్లలోకి వెళ్లి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+