రాజస్థాన్ లోని కోటాలో బోటు ప్రమాదం.. నలుగురు చిన్నారులు మృతి
రాజస్థాన్ లోని కోటాలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. దేవీ నవరాత్రులు ముగిసిన నేపథ్యంలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. దేవీ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు మొత్తం ఏడుగురు చిన్నారులు ఉండగా అందులో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులను కేషు, గోలు, సురేశ్, రాహుల్ గా గుర్తించారు.
బోటు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. డైవర్స్ ను అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ ఘటనాస్థలికి చేరుకున్నాయి. గల్లంతైన చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. జిల్లా కలెక్టర్ పియూష్ సమారియా అలాగే కోటా సిటీ ఎస్పీ తేజస్విని గౌతమ్ కూడా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

అలాగే రాష్ట్ర ఎడ్యూకేషన్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి మదన్ దిలావర్ కూడా ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇక ఈ ఘటన మంగళవారం సాయంత్రం స్టీల్ బ్రిడ్జి సమీపంలోని 80 ఫీట్ రోడ్డు వద్ద బోర్కెడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని దీపక్ అనే స్థానికుడు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కోటా ఎస్పీ గౌతమ్ మాట్లాడుతూ.. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. దుర్గా అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు పడవ నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు నీటిలో మునిగిపోయారు. మరో ముగ్గురు చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
