కుంభమేళాలో 'డిజిటల్ స్నానం'.. నెటిజెన్ల కామెంట్స్ చూస్తే..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా మహాకుంభమేళాకు పేరుంది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతున్నారు.ఇప్పటికే దాదాపు 55 కోట్ల మందికి పైగా భక్తులు గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ విషయాన్ని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందని తెలిపింది. ఫిబ్రవరి 26 నాటికి ఈ సంఖ్య 60 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఊహించని రీతిలో భక్తులు తరలివస్తున్నారని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
మరోవైపు కుంభమేళాలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి.. త్రివేణి సంగమం వద్దకు చేరుకోలేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశవిదేశాల నుంచి కుంభమేళాకు రావాలని ఉన్నా అనేక కారణాల వల్ల రాలేక పోతున్నారు. ఈ క్రమంలో వారికోసం వినూత్నంగా ఆలోచించారు. యూపీలోని ప్రయాగ్ రాజ్ కు చెందిన ఓ వ్యాపారవేత్త. అదే డిజిటల్ స్నాన్.

డిజిటల్ స్నానం అంటే..
కుంభమేళాకు వెళ్లలేని భక్తులు తమ ఫొటోలను వాట్సాప్ ద్వారా అతనికి పంపించాలి. ఆ వ్యక్తి ఆ ఫొటోలను ప్రింట్ తీసి త్రివేణి సంగమంలో వాటిని ముంచేస్తాడు. ఆ వీడియోను మీకు పంపిస్తాడు. దీంతో మీరు కూడా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించినట్లు భావించడమే డిజిటల్ స్నానం. డిజిటల్ స్నానానికి ఒక్కొక్కరి వద్ద రూ. 1,100 తీసుకుంటాడట. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి చేస్తున్నదానిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల సనాతన ధర్మానికి విఘాతం కలిగించడం అవుతుందని కామెంట్స్ పెడుతున్నారు. ఇంకో వ్యక్తి.. చైనా కు డీప్ సీక్ ఉంటే మనకు డీప్ స్నాన్ ఉందని ఎద్దేవా చేశాడు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications