ముంచుకొస్తున్న క్యార్ తుఫాను: మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ముంబై: తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి మహారాష్ట్ర తీరంవైపు కదులుతోంది. దీంతో కర్నాటక, మహారాష్ట్రలకు తుఫాను బెడద పొంచి ఉంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు 190 కిలోమీటర్ల దూరంలో క్యార్ తుఫాను ఉంది. శనివారం ఉదయం కల్లా ఈ తుఫాను బలపడి బీభత్సం సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. ఇక రత్నగిరి ప్రాంతం నుంచి తుఫాను ఒమన్ తీరం వైపు కదులుతోంది. దీంతో రత్నగిరి జిల్లాకు భారీ వర్ష సూచన ఉందంటూ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో అలల పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. అక్టోబర్ 28 నుంచి 31 వరకు ప్రజలు క్యార్ తుఫాను నుంచి అప్రమత్తతతో ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఇక్కడ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక ఈ ప్రభావంతో కర్నాటక గోవా తీరప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 12 గంటల్లో భారీ వర్షాలు ఈ రాష్ట్రాల్లో కురిసే అవకాశం ఉంది. ఇక ఉత్తర కొంకణ్ ప్రాంతం కూడా వర్షాలతో తడిసి ముద్దయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

 Kyarr cyclone Updates: Cyclone making its way towards Ratnagiri district of Maharashtra

ఇక క్యార్ తుఫాను ప్రభావిత ప్రాంతాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 24 గంటల్లో సింధుదుర్గ్ జిల్లాకు 204.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది. గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఇక శనివారం రోజున మరింత పెరిగి గంటకు 110 కిలోమీటర్ల వేగంను అందుకుంటాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇక రత్నగిరి జిల్లాలో గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ ప్రభావం గోవా రాష్ట్రంపై కూడా పడే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఇక మిగతా తీరప్రాంత జిల్లాల్లో గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై గంటకు 60 కిలోమీటర్ల మార్క్‌ను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రభావం ఉత్తర కర్నాటక తీరం, గుజరాత్ తీరంపై కూడా పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+