Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

lady: ఆసుపత్రిలో డాక్టర్ అరాచకాలు, మసాజ్ లు, మహిళా ఉద్యోగులతో రూమ్ లో ?, హెల్మెట్ పెట్టుకుని !

చెన్నై/కోవిల్ పట్టి: ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్న వ్యక్తి రెచ్చిపోయాడు. ఆసుపత్రిలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆసుపత్రిలో మహిళా ఉద్యోగులతో మసాజ్ చేయించుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. డాక్టర్ మసాజ్ చేయించుకోవడమే కాకుండా అతని స్నేహితులను కూడా ఆసుపత్రికి పిలిపించి వారికి కూడా మసాజ్ చెయ్యాలని మహిళా ఉద్యోగులు, నర్సులకు టార్చర్ పెట్టాడు. ఆసుపత్రిలో డాక్టర్ చేస్తున్న ఆగడాలను ఓ మహిళా ఉద్యోగి ఆమె మొబైల్ ఫోన్ లో వీడియో తీసింది. విషయం గుర్తించి డాక్టర్ ఆమె మీద దాడి చేసి మొబైల్ ఫోన్ లాక్కొన్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ అరచకాలు ఎక్కువ కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక విచారణ చేసి చివరికి కామాంధుడైన డాక్టర్ ను అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన సమయంలో మీడియా అక్కడికి చేరుకుంది. తన ముఖం ఎవ్వరూ గుర్తు పట్టకూడదని అతి తెలివితో ఆలోచించిన ఆ డాక్టర్ హెల్మెట్ పెట్టుకుని పోలీసుల వెంట వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది. తప్పు చేసే ముందు బుద్ది ఉండాలి, పోలీసులు పట్టుకున్న తరువాత హెల్మెట్ పెట్టుకోవడం కాదని స్థానికులు ఆ డాక్టర్ కు చివాట్లు పెట్టారు.

 ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ఉద్యోగం

ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ఉద్యోగం

తమిళనాడులోని తుత్తుకూడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని ఇళయరసానందల్ లో ప్రాథమిర ఆరోగ్యం కేంద్రం (ప్రభుత్వ ఆసుపత్రి) ఉంది. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కురుస్వామి (50) అనే వ్యక్తి డాక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. చాలా సంవత్సరాల నుంచి కురుస్వామి ఇదే ఆసుపత్రిలో డాక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

 ఆసుపత్రిలో మసాజ్ చేయించుకుంటున్న డాక్టర్

ఆసుపత్రిలో మసాజ్ చేయించుకుంటున్న డాక్టర్

ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్న కురుస్వామి రెచ్చిపోయాడు. డాక్టర్ కురుస్వామి అతను పని చేస్తున్న ఆసుపత్రిలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆసుపత్రిలో మహిళా ఉద్యోగులతో మసాజ్ చేయించుకుంటున్న డాక్టర్ కురుస్వామి పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు.

 ఎదురుతిరిగిన మహిళా ఉద్యోగి

ఎదురుతిరిగిన మహిళా ఉద్యోగి

డాక్టర్ కురుస్వామి అతను మసాజ్ చేయించుకోవడమే కాకుండా అతని స్నేహితులను కూడా ఆసుపత్రికి పిలిపించి వారికి కూడా మసాజ్ చెయ్యాలని మహిళా ఉద్యోగులు, నర్సులకు టార్చర్ పెట్టాడు. ప్రభుత్వ ఆసుపత్రిని డాక్టర్ కురుస్వామి మసాజ్ సెంటర్ గా మార్చేశాడు. ఇదే ఆసుపత్రిలో పని చేస్తున్న ఉద్యోగి నిలవేణి డాక్టర్ కురుస్వామికి ఎదురుతిరిగింది మీరు చేస్తున్న పని బాగాలేదు సార్ అంటూ నీలవేణి డాక్టర్ కురుస్వామికి పదేపదే చెప్పినా అతను మాత్రం పట్టించుకోలేదు.

 పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

మహిళా ఉద్యోగులతో మసాజ్ చేయించుకుంటున్న డాక్టర్ కురుస్వామి వారి శరీరం మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి వారిని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ కురుస్వామి చేస్తున్న ఆగడాలను మహిళా ఉద్యోగి నీలవేణి ఆమె మొబైల్ ఫోన్ లో వీడియో తీసింది. విషయం గుర్తించి డాక్టర్ కురుస్వామి నీలవేణి మీద దాడి చేసి ఆమె మొబైల్ ఫోన్ లాక్కొన్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ కురుస్వామి అరచకాలు ఎక్కువ కావడంతో నీలవేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 హెల్మెట్ పెట్టుకున్న డాక్టర్

హెల్మెట్ పెట్టుకున్న డాక్టర్

పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక విచారణ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ కురుస్వామి అరాచకాల గురించి అక్కడ పని చేస్తున్న మహిళా ఉద్యోగులు పోలీసులకు పిన్ టూ పిన్ చెప్పారు. కామాంధుడైన డాక్టర్ కురుస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన సమయంలో మీడియా అక్కడికి చేరుకుంది. తన ముఖం ఎవ్వరూ గుర్తు పట్టకూడదని అతి తెలివితో ఆలోచించిన డాక్టర్ కురుస్వామి హెల్మెట్ పెట్టుకుని ఆసుపత్రి నుంచి పోలీసుల వెంట బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు.

 ఉద్యోగం ఊడుతుంది

ఉద్యోగం ఊడుతుంది

తప్పు చేసే ముందు బుద్ది ఉండాలి, పోలీసులు పట్టుకున్న తరువాత హెల్మెట్ పెట్టుకోవడం కాదని స్థానికులు డాక్టర్ కురుస్వామికి చివాట్లు పెట్టారు. ప్రభుత్వ డాక్టర్ కురుస్వామి అరెస్టు కావడంతో అతని మీద విచారణకు జిల్లా సీనియర్ వైద్యశాఖ అధికారి బాస్కో రాజా విచారణకు ఆదేశించారు. డాక్టర్ కురుస్వామి తప్పు చేసినట్లు తెలిస్తే అతన్ని ఉద్యోగం నుంచి తప్పిస్తామని వైద్యశాఖ అధికారి బాస్కో రాజా మీడియాకు చెప్పారు.

 కాంట్రాక్టు మహిళా ఉద్యోగులతో ?

కాంట్రాక్టు మహిళా ఉద్యోగులతో ?

ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ కురుస్వామి సాటి మహిళా ఉద్యోగులను లైంగిక వేధింపులకు గురి చెయ్యడం కలకలం రేపింది. కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్న మహిళలను మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేయిస్తానని మాయమాటలు చెప్పిన డాక్టర్ కురుస్వామి లొంగదీసుకుని వారిని చాలా కాలంగా లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+