Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ladies PG: లేడీ డాక్టర్, లేడీ హెచ్ఆర్ మేనేజర్, అర్దరాత్రి పీజీలో ?, వీడియో వైరల్, వీడియో కాల్స్ తో !

బెంగళూరు: ఉద్యోగాలు చేస్తున్న యువతి, యువకులు పీజీల్లో నివాసం ఉంటున్నారు. కొందరు స్నేహితులు ఇళ్లను అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. బ్యాచిలర్స్ ఎక్కువగా పీజీల్లోనే నివాసం ఉంటున్నారు. ఐటీ హబ్ లో దిక్కులేనన్ని పీజీలు ఉన్నాయి. ఇలాంటి లేడీస్ పీజీలో ప్రభుత్వ లేడీ డాక్టర్ మీద హెచ్ఆర్ లేడీ మేనేజర్ దాడి చెయ్యడం కలకలం రేపింది. లేడీ హెచ్ఆర్ మేనేజర్ దాడిలో గాయపడిన ప్రభుత్వ డాక్టర్ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. అర్దరాత్రి లేడీ హెచ్ఆర్ మేనేజర్ వీడియో కాల్స్ తో రచ్చరచ్చ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. పీజీలో ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు యువతుల గొడవ ఇప్పుడు లోకల్, నాన్ లోకల్ రంగు పులుముకుంది.

దిక్కులేనన్ని పీజీలు

దిక్కులేనన్ని పీజీలు

ఐటీ హబ్ బెంగళూరులో దిక్కులేనన్ని పీజీలు ఉన్నాయి. ఎక్కడ చూసినా బాయ్స్ పీజీలు, గర్ల్స్ పీజలు దర్శనం ఇస్తున్నాయి. ఇక బెంగళూరులోని బీటీఎం లేఔట్ లో అయితే అదో పెద్ద పీజీల హబ్ అని నగర ప్రజలకు తెలుసు. వ్యాపారం చెయ్యాలి, కష్టం లేకుండా డబ్బులు సంపాధించాలని అనుకుంటున్న కొందరు సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా పీజీలు పెట్టేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

అదే బీటీఎం లేఔట్ పీజీలో ?

అదే బీటీఎం లేఔట్ పీజీలో ?

బెంగళూరులోని బీటీఎం లేఔట్ లోని ఓ పీజీలో ఉంటున్న బీబీఎంపీ వైద్యురాలు డాక్టర్ సృష్టిపై కేరళకు చెందిన ఓ మలయాళీ యువతి దాడికి పాల్పడటం కలకలం రేపింది. బీటీఎం లేఅవుట్‌ లోని మహిళా పేయింగ్ గెస్ట్ లో రెండు రోజుల క్రితం జరిగిన దాడికి సంబంధించి బీబీఎంపీ లేడీ డాక్టర్ సృష్టి అర్దరాత్రి ఏడుస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అది వైరల్ అయ్యింది.

ఒకే రూమ్ లో లేడీ హెచ్ఆర్, లేడీ డాక్టర్

ఒకే రూమ్ లో లేడీ హెచ్ఆర్, లేడీ డాక్టర్

బీటీఎం లేఔట్ లోని ఓ లేడీస్ పీజీలో బీబీఎంపీ లేడీ డాక్టర్ సృష్టి నివాసం ఉంటున్నది. బీబీఎంపీ లేడీ డాక్టర్ సృష్టి ఉంటున్న రూమ్ లోనే కేరళకు చెందిన ఆశీల్ అనే యువతి నివాసం ఉంటున్నది. కొంతకాలంగా లేడీ డాక్టర్ సృష్టి, కేరళ యువతి ఆశీల్ రూమ్ మేట్స్ గా ఉంటున్నారు. ప్రతిరోజు ఉదయం ఎవరిపాటికి వాళ్లు ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. రాత్రి మళ్లీ ఇద్దరూ రూమ్ కు చేరుకుంటున్నారు.

అర్దరాత్రి ఏం జరిగింది ?

అర్దరాత్రి ఏం జరిగింది ?

బీటీఎం లేఅవుట్‌ లోని పీజీలో జనవరి 10వ తేదీ అర్థరాత్రి బీబీఎంపీలో డాక్టర్‌గా పనిచేస్తున్న తన మీద కేరళకు చెందిన యువతి ఆశీల్ దాడి చేసిందని ఆరోపిస్తూ డాక్టర్ సృష్టి ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కేరళకు చెందిన ఆశీల్ ఇందిరా నగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తోందని, అర్దరాత్రి తనను ఇష్టం వచ్చినట్లు కొట్టి నీకు దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరించిందని బీబీఎంపీ డాక్టర్ సృష్టి బోరన విలపిస్తూ ఓ వీడియో పోస్టు చెయ్యడంతో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కన్నడ బాషను అవమానించింది

కన్నడ బాషను అవమానించింది

అర్దరాత్రి తన మీద దాడి చెయ్యడమే కాకుండా కన్నడ బాషను, కన్నడిగులను చులకనగా మాట్లాడిన ఆశీల్ రెచ్చిపోయిందని డాక్టర్ సృష్టి ఆరోపించింది. ఈ విషయంలో మనస్తాపానికి గురైన డాక్టర్ సృష్టి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైకోలేఅవుట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ వైద్యురాలి మీద దాడి జరగడంతో పోలీసులు సీరియర్ అయ్యారని తెలిసింది.

అర్దరాత్రి వీడియో కాల్స్ చేసి ?

అర్దరాత్రి వీడియో కాల్స్ చేసి ?

బీబీఎంపీ లేడీ డాక్టర్ సృష్టి పోలీస్ స్టేషన్ ఇలా ఫిర్యాదు చేశారు. నా రూమ్‌మేట్ కేరళకు చెందిన ఆశీల్ అర్థరాత్రి వరకు వీడియో కాల్స్‌లో చాలా గట్టిగా మాట్లాడుతోందని ఆరోపించింది. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఆశీల్ కు పనిభారం అంతగా లేదని, అర్దరాత్రి వరకు నిద్రపోకుండా మేలుకుని ఫోన్ లో చాలా గట్టిగా మాట్లాడుతోందని బీబీఎంపీ లేడీ డాక్టర్ సృష్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీబీఎంపీలో డాక్టర్‌గా పనిచేస్తున్న నేను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విధుల్లో ఉంటానని, తరువాత రూమ్ కు వెలుతున్నానని పోలీసులకు చెప్పింది. .

చిన్నగా మాట్లాడు అన్నందుకు చితకబాదేసింది

చిన్నగా మాట్లాడు అన్నందుకు చితకబాదేసింది

నేను ప్రతిరోజూ 11 గంటలకు పడుకుంటానని, అయితే నా రూమ్‌మేట్ ఆశీల్ అర్థరాత్రి వరకు వీడియో కాల్స్‌లో మాట్లాడుతూ తన నిద్రకు భంగం కలిగిస్తున్నదని, జనవరి 10వ తేదీ అర్ధరాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు వీడియో కాల్ లో చాలా గట్టిగా మాట్లాడిందని, ఆ సమయంలో చిన్నగా మాట్లాడు, నేను నిద్రపోతున్నానని చెబితే తన మీద ఆశీల్ దాడికి పాల్పడిందని లేడీ డాక్టర్ ఆరోపించారు.

లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్

లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్

కన్నడ బాష మాట్లాడేవారిని, కన్నడిగులను అవమానించి హేళనగా మాట్లాడిందని, కర్ణాటకలో ఉద్యోగం చేస్తూ ఇక్కడి ప్రజల మనోభావలు దెబ్బ తినేలా మాట్లాడిందని ఆరోపిస్తూ బీబీఎంపీ లేడీ డాక్టర్ సృష్టి పోలీస్ స్టేషన్ ఇలా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రైవేట్ కంపెనీ లేడీ హెచ్ఆర్ మేనేజర్ ఆశీల్ ను విచారణ చేస్తున్నారు. మొత్తం మీద పీజీలో లేడీస్ గొడవ ఇప్పుడు లోకల్, నాన్ లోకల్ (కన్నడ, మళయాలం) రంగు పులుముకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+