Lady: కాలేజ్ అమ్మాయి ఫోటోలు మార్ఫింగ్ చేసి నగ్నంగా వీడియో కాల్ లో ?, ఎలక్ట్రీషియన్ కరెంట్ కట్, క్లోజ్ !
బెంగళూరు: సోషల్ మీడియాలో అమ్మాయి ఫోటోతో నకిలి అకౌంట్ ప్రారంభించిన కామాంధుడు అనేక మంది కాలేజ్ అమ్మాయిలు, వివాహిత మహిళలను పరిచయం చేసుకున్నాడు. అమ్మాయి టైపులోనే చాలా మందితో వారికి నమ్మకం కలిగే వరకు చాటింగ్ చేశాడు. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయిన కాలేజ్ అమ్మాయితో నమ్మకంగా చాటింగ్ చేసిన కామాంధుడు తరువాత అసలు స్వరూపం చూపించాడు. కాలేజ్ అమ్మాయి ఫోటోలను సోషల్ మీడియాలో డౌన్ లోడ్ చేసుకున్న కిరాతకుడు వాటిని న్యూడ్ ఫోటోలుగా మార్ఫింగ్ చేశాడు. ఇలా అతనికి కావాలసిన రీతిలో మార్ఫింగ్ చేసుకున్న తరువాత ఆ ఫొటోలను కాలేజ్ అమ్మాయికి పంపించాడు. నాతో నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడాలని, లేదంటే ఈ ఫోటోలు మొత్తం సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. కిరాతకుడి దెబ్బకు హడలిపోయిన యువతి చేసిన పనికి మనోడి ఒంట్లో కరెంట్ కట్ చేశారు.

ఎలక్ట్రీషియన్ పని
తమిళనాడులోని కోయంబత్తూరులో నియాజ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఎలక్ట్రీషియన్ పని చేస్తున్న నియాజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉన్నాడు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో అందమైన అమ్మాయిల ఫోటోలు, నకిలి పేర్లు పెట్టిన నియాజ్ నకిలి అకౌంట్ లు ప్రారంభించాడు.

నమ్మకం వచ్చే వరకు వెయిటింగ్
సోషల్ మీడియాలో అందమైన అమ్మాయి ఫోటోలతో నకిలీ అకౌంట్ ప్రారంభించిన కామాంధుడు నియాజ్ అనేక మంది కాలేజ్ అమ్మాయిలు, వివాహిత మహిళలను పరిచయం చేసుకున్నాడు. అమ్మాయి టైపులోనే చాలా మందితో వారికి నమ్మకం కలిగే వరకు ఎలక్ట్రీషియన్ నియాజ్ డౌట్ రాకుండా చాటింగ్ చేశాడు.

కాలేజ్ అమ్మయితో ?
ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయిన కాలేజ్ అమ్మాయితో నమ్మకంగా చాటింగ్ చేసిన కామాంధుడు నియాజ్ తరువాత అసలు స్వరూపం చూపించాడు. కాలేజ్ అమ్మాయి ఫోటోలను సోషల్ మీడియాలో డౌన్ లోడ్ చేసుకున్న నియాజ్ వాటిని న్యూడ్ ఫోటోలుగా మార్ఫింగ్ చేశాడు. నియాజ్ ఈ రకంగా అతనికి కావాలసిన రీతిలో మార్ఫింగ్ చేసుకున్న తరువాత ఆ ఫొటోలను కాలేజ్ అమ్మాయికి పంపించాడు.
Recommended Video

నగ్నంగా వీడియో కాల్ చెయ్యాలని డిమాండ్
నాతో నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడాలని, లేదంటే ఈ ఫోటోలు మొత్తం సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. అయితే ఆ అమ్మాయి చాలా రోజులు అతనికి చిక్కకుండా దూరం పెట్టింది. సోషల్ మీడియాలో పదేపదే బ్లాక్ మెయిల్ చేస్తున్న నియాజ్ టార్చర్ తట్టుకోలేక కాలేజ్ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నియాజ్ ను అరెస్టు చేశారు. కిరాతకుడు నియాజ్ గతంలో ఇలాగే మహిళలను బ్లాక్ మెయిల్ చేసి వారితో నగ్నంగా వీడియో కాల్స్ లో మాట్లాడాడని, ఆ వీడియోలు ఫోటోలు అతని మొబైల్ ఫోన్ లో ఉన్నాయని, అతన్ని విచారణ చేస్తున్నామని కోయంబత్తూరు పోలీసులు తెలిపారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications