Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady lawyer: ఫేమస్ లాయర్, జడ్జ్ కావాలని చదువుతోంది, భార్య సంపాదనతో జల్సా, భర్త దెబ్బతో !

బెంగళూరు/ మైసూరు: లా చదివిన యువతి ఎప్పటికైనా జడ్జ్ కావాలని ఆశపడింది. జడ్జ్ కావాలని ఆశతో పరీక్షలు రాస్తున్నది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి సంబంధం చూశారు. పెళ్లి చేసుకున్న తరువాత కూడా నువ్వు లాయర్ గా ప్రాక్టీస్ చెయ్యడానికి నేను ఒప్పుకుంటున్నానని, జడ్జ్ పరీక్షలు రాయడానికి నేను సహకరిస్తానని అప్పట్లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న యువకుడు చెప్పాడు. తన ఆశయాలు నెరవేర్చడానికి అంగీకరిస్తున్న వ్యక్తి తనకు భర్త అవుతున్నాడని ఆమె మురిసిపోయింది. ఇంట్లో చెప్పినట్లుగానే అతన్ని పెళ్లి చేసుకుని కోర్టులో కేసులు వాదిస్తోంది. కోర్టులో కేసులు వాదిస్తున్న లేడీ లాయర్ జడ్జ్ పరీక్షలు రాయడినికి శిక్షణ తీసుకుంటున్నది. చిన్న విషయంలో లేడీ లాయర్ సొంత సోదరుడు హత్యకు గురైనాడు. సోదరుడిని చంపిన వాళ్లకు శిక్షపడేలా చేసిన లాయర్ మంచి పేరు తెచ్చుకుంది. జడ్జ్ కావాలని కలకల కంటున్న లేడీ లాయర్ ఆమె కట్టుకున్న భర్త ఆగడాలకు బలికావడం కలకలం రేపింది.

లేడీ లాయర్

లేడీ లాయర్

కర్ణాటకలోని రాచనగరి మైసూరు జిల్లాలో చంద్రకళ అనే యువతి నివాసం ఉంటున్నది. లా చదివిన చంద్రకళా ఎప్పటికైనా జడ్జ్ కావాలని ఆశపడింది. మైసూరు నగరంలోని కోర్టులో చంద్రకళా లాయర్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. జడ్జ్ కావాలని ఆశతో పరీక్షలు రాస్తున్నది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు చంద్రకళాకు పెళ్లి సంబంధం చూశారు.

కాబోయే భర్తకు రెండో పెళ్లి అని తెలిసినా ?

కాబోయే భర్తకు రెండో పెళ్లి అని తెలిసినా ?

మైసూరు నగరంలో ప్రదీప్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వివాహం చేసుకున్న నెల రోజులకే ప్రదీప్ అతని భార్యతో విడిపోయి వేరుగా ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం మ్యాట్రీమోనీలో ప్రదీప్ పెళ్లి సంబంధాన్ని చంద్రకళా కుటుంబ సభ్యులు చూశారు. ఆ సమయంలో ప్రదీప్ కు ఇది రెండో పెళ్లి అని తెలిసినా చంద్రకళా కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం సెట్ చెయ్యడానికి చర్చలు జరిపారు.

ఓకే చెప్పిన లేడీ లాయర్

ఓకే చెప్పిన లేడీ లాయర్

తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని, జడ్జ్ అయిన తరువాత పెళ్లి చేసుకుంటానని చంద్రకళా ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. పెళ్లి చేసుకున్న తరువాత కూడా నువ్వు లాయర్ గా ప్రాక్టీస్ చెయ్యడానికి నేను ఒప్పుకుంటున్నానని, జడ్జ్ పరీక్షలు రాయడానికి నేను పూర్తిగా సహకరిస్తానని అప్పట్లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న ప్రదీప్ లేడీ లాయర్ చంద్రకళాకు మాయమాటలు చెప్పాడు.

మూడు సంవత్సరాల క్రితం పెళ్లి

మూడు సంవత్సరాల క్రితం పెళ్లి

తన ఆశయాలు నెరవేర్చడానికి అంగీకరిస్తున్న వ్యక్తి తనకు భర్త అవుతున్నాడని మురిసిపోయిన చంద్రకళా ప్రదీప్ ను పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మూడు సంవత్సరాల క్రితం గ్రాండ్ గా పెళ్లి జరిగింది. భర్తతో కాపురం చేసిన చంద్రకళాకు సంవత్సరం క్రితం ఓ పాప పుట్టింది. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న ప్రదీప్ కరోనా వైరస్ సెకండ్ వేవ్ తరువాత ఉద్యోగం నిలిపేసి భార్య చంద్రకళా సంపాదిస్తుంటే ఎంజాయ్ చేస్తూ ఇంట్లోనే ఉంటున్నాడు.

సోదరుడి హత్య కేసు వాదించిన లేడీ లాయర్

సోదరుడి హత్య కేసు వాదించిన లేడీ లాయర్

ఇంట్లో చెప్పినట్లుగానే ప్రదీప్ ను పెళ్లి చేసుకున్న తరువాత చంద్రకళా మైసూరు కోర్టులో కేసులు వాదిస్తోంది. కోర్టులో కేసులు వాదిస్తున్న లేడీ లాయర్ చంద్రకళా జడ్జ్ పరీక్షలు రాయడినికి శిక్షణ తీసుకుంటున్నది. మొబైల్ కోసం ఆశపడిన ముగ్గురు నిందితులు లేడీ లాయర్ చంద్రకళా సొంత సోదరుడిని హత్యకు చేశారు. సోదరుడిని చంపిన వాళ్లకు శిక్షపడేలా చేసిన లేడీ లాయర్ చంద్రకళా కోర్టులో సాటి న్యాయవాదుల దగ్గర, స్థానికంగా మంచి పేరు తెచ్చుకుంది.

 భర్తకు వరకట్నం దాహం

భర్తకు వరకట్నం దాహం

బయట అనేక కేసులు వాదిస్తున్న చంద్రకళాకు ఇంట్లో భర్త ప్రదీప్ పోరు ఎక్కువ అయ్యింది. మీ తల్లిదండ్రులను అడిగి ఆస్తిలో భాగం పెట్టించుకోవాలని ప్రదీప్ అతని భార్య చంద్రకళాను టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి. తాను పుట్టింటిలో ఆస్తిలో భాగం కావాలని అడగనని లాయర్ చంద్రకళా తేల్చి చెప్పింది. ఇదే విషయంలో చంద్రకళా, ప్రదీప్ దంపతుల మద్య గొడవలకు దారితీసిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

శవమైన లేడీ లాయర్, భర్త ఉరి వేసి చంపేశాడని కేసు

శవమైన లేడీ లాయర్, భర్త ఉరి వేసి చంపేశాడని కేసు

పుట్టింటి నుంచి ఆస్తి, కట్నం తీసుకురావడానికి నిరాకరించిన చంద్రకళాను పట్టుకుని చితకబాదుతున్న ప్రదీప్ ఆమెకు నరకం చూపించాడని తెలిసింది. వేకువ జామున 3 గంటలకు చంద్రకళాకు ఫోన్ చేసిన ప్రదీప్ మీ కూతురు ఉరి వేసుకుందని చెప్పాడు. కుటుంబ సభ్యులు వెళ్లి చంద్రకళాను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చంద్రకళా ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు. కట్నం కోసం అల్లుడు ప్రదీప్ మా కూతురిని చంపేశాడని చంద్రకళా కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. పోలీసులు లేడీ లాయర్ చంద్రకళాను ఆమె భర్త ప్రదీప్ హత్య చేశాడని కేసు నమోదు చేశారు. కోర్టులో కేసులు వాదిస్తున్న లాయర్ చంద్రకళా ఆమె భర్త ఆగడాలకు బలికావడం మైసూరులో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+