Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady leader: స్కామ్, SI ఉద్యోగాల పరీక్షలు, అధికార పార్టీ లేడీ స్కూల్ లో ?, రూ. కోట్లలో డీల్, సీఐడీ ఎంట్రీ !

బెంగళూరు/ కలబురిగి: పోలీసు సబ్ ఇన్స్ పెక్టర్ (ఎస్ఐ) ఉద్యోగాల నియామకాల పరీక్షల్లో గోల్ మాల్ జరిగిందని వెలుగు చూసిన వ్యవహారం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే విద్యాసంస్థల యజమాని, బీజేపీ లేడీ లీడర్ వ్యవహారం బయటకు రావడం కలకలం రేపింది. మాజీ సీఎం, ప్రస్తుత హోమ్ మంత్రితో ఆ నాయకురాలు దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పటికే లేడీ లీడర్ స్కూల్ లో ఉద్యోగం చేస్తున్న ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. సీఐడీ పోలీసులు అధికార పార్టీ నాయకురాలి ఇంటిలో సోదాలు చేశారు. లేడీ లీడర్ మాయం కావడంతో ఆమె భర్తను విచారణ చేసిన సీఐడీ పోలీసులు వివరాలు సేకరించారు. లేడీ లీడర్ విద్యాసంస్థల్లో ఎస్ఐ ఉద్యోగాలకు పరీక్షలు రాసిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇంకా కొందరు పరారైనారు. ఎస్ఐ ఉద్యోగాల పరీక్షల గోల్ మాల్ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంలో అధికార పార్టీ నాయకురాలి కుమ్మక్కు అయ్యారని రూ. కోట్లలో లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఇంటిలో సీఐడీ పోలీసులు సోదాలు చెయ్యడంహాట్ టాపిక్ అయ్యింది.

అధికార పార్టీ నాయకురాలు

అధికార పార్టీ నాయకురాలు

కర్ణాటకలోని కలబురిగిలో దివ్యా హగరగి అలియాస్ దివ్యా నివాసం ఉంటున్నారు. బీజేపీ నాయకురాలు అయిన దివ్యా జ్ఞానజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ తో పాటు విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. విద్యాసంస్థల యజమానిగా, బీజేపీ నాయకురాలిగా దివ్యాకు ప్రజల్లో, రాజకీయ నాయకుల్లో మంచి గుర్తింపు ఉంది.

ఎస్ఐ ఉద్యోగాల రాతపరీక్షలు

ఎస్ఐ ఉద్యోగాల రాతపరీక్షలు

కర్ణాటకలో ఇటీవల పోలీసు సబ్ ఇన్స్ పెక్టర్ (SI)ఉద్యోగాలకు రాతసరీక్షలు జరిగాయి. ఎస్ఐ ఉద్యోగాలు సంపాధించాలని వేలాది మంది నిరుద్యోగులు రాతపరీక్షలకు హాజరైనారు. బీజేపీ నాయకురాలు దివ్యాకు చెందిన జ్ఞానజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పరీక్షా కేంద్రంలో వందలాది మంది నిరుద్యోగులు ఎస్ఐ పరీక్షలకు హాజరైనారు.

దివ్యా మేడమ్ స్కూల్ లో గోల్ మాల్ !

దివ్యా మేడమ్ స్కూల్ లో గోల్ మాల్ !

బీజేపీ నాయకురాలు అయిన దివ్యా జ్ఞానజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎస్ఐ పరీక్షలకు హాజరైనా అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారని వెలుగు చూడటంతో పోలీసులు అధికారులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసు సబ్ ఇన్స్ పెక్టర్ (ఎస్ఐ) ఉద్యోగాల నియామకాల పరీక్షల్లో గోల్ మాల్ జరిగిందని వెలుగు చూడటంతో అధికార బీజేపీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు హడలిపోయారు.

IMR షీట్లు తారుమారు ?

IMR షీట్లు తారుమారు ?

బీజేపీ నాయకురాలు దివ్యాకు చెందిన జ్ఞానజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో పరీక్షలు రాసిన అభ్యర్థుల ఐఎంఆర్ షీట్లలో భారీగా అవకతవకలు జరిగాయని, పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందు ఆన్సర్లు ఉన్న స్లిప్ లో పరీక్షలు రాసేవారి చేతికి వెళ్లాయని, కొందరు ఐఎంఆర్ షీట్లు ఖాళీగా ఇచ్చిన తరువాత కొందరు లెక్సరర్స్ ఆ జవాబు పత్రాల్లో అన్సర్లు రాశారని వెలుగు చూడటం కలకలం రేపింది.

మాజీ సీఎం, సిట్టింగ్ హోమ్ మంత్రితో లేడీ లీడర్ ఫోటోలు వైరల్

మాజీ సీఎం, సిట్టింగ్ హోమ్ మంత్రితో లేడీ లీడర్ ఫోటోలు వైరల్

ఇప్పటికే విద్యాసంస్థల యజమాని, బీజేపీ లేడీ లీడర్ దివ్యా వ్యవహారం బయటకు రావడం కలకలం రేపింది. మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, ప్రస్తుత కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్రతో బీజేపీ నాయకురాలు దివ్యా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే లేడీ లీడర్ దివ్యా స్కూల్ లో ఉద్యోగం చేస్తున్న సుమిత్రా, సుమా, సిద్దమ్మ అనే ముగ్గురు మహిళా టీచర్లను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.

 లేడీ లీడర్ ఇంటిలో సీఐడీ సోదాలు

లేడీ లీడర్ ఇంటిలో సీఐడీ సోదాలు

అరెస్టు అయిన ముగ్గురు మహిళలు ఇచ్చిన సమాచారం మేరకు సీఐడీ పోలీసులు అధికార పార్టీ నాయకురాలు దివ్యా ఇంటిలో సోదాలు చేశారు. లేడీ లీడర్ దివ్యా మాయం కావడంతో ఆమె భర్త రాజేష్ ను విచారణ చేసిన సీఐడీ పోలీసులు వివరాలు సేకరించారు. లేడీ లీడర్ దివ్యా విద్యాసంస్థల్లో ఎస్ఐ ఉద్యోగాలకు పరీక్షలు రాసిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇంకా కొందరు పరారైనారు.

రూ. కోట్లలో గోల్ మాల్ ?

రూ. కోట్లలో గోల్ మాల్ ?

ఎస్ఐ ఉద్యోగాల పరీక్షల గోల్ మాల్ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంలో అధికార పార్టీ నాయకురాలు దివ్యా కుమ్మక్కు అయ్యారని, ఆమె స్కూల్ లో పరీక్షలు రాసిన ఒక్కొక్కరి దగ్గర రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు వసూలు చేశారని, ఇలా రూ. కోట్లలో లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ నాయకురాలు దివ్యా ఇంటిలో సీఐడీ పోలీసులు సోదాలు చెయ్యడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+