Lady officer: తహసిల్దార్ కు ఎంతమంది భర్తలు ?, కాపురం ఎవరితో ?, అవసరమా అన్నయ్య !
బెంగళూరు/కోలారు: ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వివరాలు, ప్రభుత్వ అధికారులకు సంబంధించిన వివరాలు, ప్రభుత్వ కాంట్రాక్టు పనులు, వాటి బిల్లులు, అవకతవకల గురించి ఆర్ టీఐ కార్యకర్తలు (సామాజిక కార్యకర్తలు) ఆరా తీస్తున్న విషయం తెలిసిందే. ఆర్ టీఐ కార్యకర్తల దెబ్బతో కొందరు అవినీతి అధికారులు పనులు త్వరగా చెయ్యడం మొదలు పెట్టారు. అయితే ఓ ఆర్ టీఐ కార్యకర్త సమర్పించిన అర్జీ పరిశీలించిన అధికారులు బిత్తరపోయారు. మహిళా తహసిల్దార్ ఇప్పటి వరకు ఎంతమందిని పెళ్లి చేసుకున్నారు ?, ఎంత మందికి విడాకులు ఇచ్చారు ?, ప్రస్తుతం ఆమె ఏ భర్తతో కాపురం చేస్తోంది ?, ఆమెకు వివాహాలు ఎప్పుడెప్పుడు జరిగాయి ?, ఏ కల్యాణమండపాలలో ఆమె పెళ్లి జరిగింది అంటూ ఆర్ టీఐ కార్యకర్త సంబంధిత అధికారులకు అర్జీ సమర్పించడంతో అధికారులు బిత్తరపోయారు. అయితే తరువాత సీన్ సీడేల్ కావడంతో ఆర్ టీఐ కార్యకర్తకు పట్టపగలే చుక్కలు కనిపించాయి.

పుట్టగొడుగుల్లా ఆర్ టీఐ కార్యకర్తలు
కర్ణాటకలో పుట్టగొడుగుల్లా ఆర్ టీఐ కార్యకర్తలు వీధికి ఒకరు తయారైనారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వివరాలు, ప్రభుత్వ అధికారులకు సంబంధించిన వివరాలు, ప్రభుత్వ కాంట్రాక్టు పనులు, వాటి బిల్లులు, అవకతవకల గురించి ఆర్ టీఐ కార్యకర్తలు (సామాజిక కార్యకర్తలు) ఆరా తీస్తున్న విషయం తెలిసిందే.

మాజీ సీఎంలు, మాజీ మంత్రులు
ఆర్ టీఐ కార్యకర్తల దెబ్బతో కొందరు అవినీతి అధికారులు పనులు త్వరగా చెయ్యడం మొదలు పెట్టారు. కొందరు ఆర్ టీఐ కార్యకర్తలు మాజీ సీఎంలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల గురించి వివరాలు సేకరించి కోర్టుల్లో ఇప్పటికే కేసులు వేశారు. కొందరు కిలాడీలు ఆర్ టీఐతో సమాచారం సేకరించి రాజకీయ నాయకులు, అధికారులను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

లేడీ తహసిల్దార్ కు ఎంత మంది భర్తలు ?
కర్ణాటకలోని కోలారు జిల్లాలోని ముళబాగిల్ తాలుకాలోని మండికల్ గ్రామంలో నాగరాజ్ అలియాస్ నాగా అనే ఆర్ టీఐ కార్యకర్త ఉంటున్నాడు. కోలారు జిల్లాకు చెందిన మహిళా తహసిల్దార్ తో నాగరాజ్ కు వ్యవహారం చెడిందని తెలిసింది. మహిళా తహసిల్దార్ ఎంత మందిని వివాహం చేసుకుంది అని వివరాలు సేకరించాలని నాగరాజ్ డిసైడ్ అయ్యారు.

మేడమ్ ఎంతమందికి విడాకులు ఇచ్చారు ?
ఆర్ టీఐ కార్యకర్త నాగరాజ్ సమర్పించిన అర్జీ పరిశీలించిన అధికారులు బిత్తరపోయారు. మహిళా తహసిల్దార్ ఇప్పటి వరకు ఎంతమందిని పెళ్లి చేసుకున్నారు ?, ఎంత మందికి విడాకులు ఇచ్చారు ?, ప్రస్తుతం ఆమె ఏ భర్తతో కాపురం చేస్తోంది ?, ఆమెకు వివాహాలు ఎప్పుడెప్పుడు జరిగాయి ?, ఏ కల్యాణమండపాలలో ఆమె పెళ్లి జరిగింది అంటూ ఆర్ టీఐ కార్యకర్త నాగరాజ్ సంబంధిత అధికారులకు అర్జీ సమర్పించడంతో అధికారులు బిత్తరపోయారు.

దెబ్బకు దెయ్యం దిగిపోయింది
ఆర్ టీఐ కార్యకర్త సమర్పించిన అర్జీ పరిశీలించిన అధికారులు ఆ మహిళా తహసిల్దార్ కు సమాచారం ఇచ్చారు. తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుని తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తాను సక్రమంగా విధులు నిర్వహించడానికి అవకాశం లేకుండా చేస్తున్నాడని ఆర్ టీఐ కార్యకర్త నాగరాజ్ మీద ఆ మహిళ తహసిల్దార్ కేసు పెట్టారు.

అవసరమా అన్నయ్య
కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్ టీఐ కార్యకర్త నాగరాజ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. లేడీ తహసిల్దార్ దెబ్బతో ఆర్ టీఐ కార్యకర్తకు నాగరాజ్ కు పట్టపగలే చుక్కలు కనిపించాయి. మహిళా అధికారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని కేసు నమోదు చేసిన పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications