భర్త ఢిల్లీలో, ఐఓసీఎల్ లేడీ రీజనల్ మేనేజర్, ఆఫీసు పైనుంచి దూకి, అక్కడ మేడమ్ కు ?
బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. ఒకే సిటీలో దంపతులు ఉద్యోగాలు చేస్తూ హ్యాపీగా ఉండే వాళ్లు. దంపతులకు పిల్లలు లేరు. ఇటీవల భార్య వేరే సిటీకి బదిలి అయ్యింది. రాత్రి కార్యాలయంలోనే భార్య విధుల్లో ఉంది. కార్యాలయం నాలుగో అంతస్తు మీదకు వెళ్లిన లేడీ రీజనల్ మేనేజర్ అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఢిల్లీకి చెందిన అపర్ణ కుమారి అలియాస్ అపర్ణ (41)కు వివాహం అయ్యింది. భర్తతో పాటు అపర్ణ ఢిల్లీలోనే ఉండేది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసీఎల్)లో అపర్ణ కుమారి రీజనల్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నారు. భర్తతో పాటు అపర్ణ ఢిల్లీలోనే ఉద్యోగం చేస్తూ ఇంతకాలం చాలా సంతోషంగా ఉండేదని తెలిసింది.
కొంతకాలం క్రితం అపర్ణకు బెంగళూకు బదిలి అయ్యింది. బెంగళూరు చేరుకున్న అపర్ణ ఇక్కడి అశోక్ నగర్ ఏరియాలో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తున్నది. బెంగళూరులోని టౌన్ హాల్ సమీపంలోని యూనిటీ బిల్డింగ్ లో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయంలో అపర్ణ విధులకు హాజరౌతున్నది.

గురువారం ఉద్యోగానికి వెళ్లిన అపర్ణ సాయంత్రం ఆరు గంటల సమయంలో బాత్ రూమ్ కు వెళ్లి ఒక గంట తరువాత ఆమె సీటులోకి వెళ్లింది. రాత్రి 7 గంటల సమయంలో ఆఫీసులోని నాలుగో అంతస్తు మీదకు వెళ్లిన అపర్ణ అక్కడి కిటికీకి పంజాబ్ డ్రెస్ వేల్ కడుతున్న సమయంలో సాటి సిబ్బందికి అనుమానం వచ్చి మేడమ్ ఏం చేస్తున్నారు అని అపర్ణను ప్రశ్నించారు.
ఆ సందర్బంలో అపర్ణ యూనిటీ బిల్డింగ్ నాలుగో అంతస్తు మీద నుంచి కిందకు దూకేశారు. తీవ్రగాయాలైన అపర్ణను విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అపర్ణ చనిపోయిందని పోలీసులు అన్నారు. ఢిల్లీలో ఉన్న అపర్ణ భర్తకు సమాచారం ఇచ్చామని, ఆయన బెంగళూరు వచ్చిన తరువాత అసలు మ్యాటర్ తెలుస్తుందని ఎస్ జే పార్క్ పోలీసులు తెలిపారు. పని ఒత్తిడి, మెంటల్ టార్చర్ కారణంగా అపర్ణ ఆత్మహత్య చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications