Lady teacher: అబ్బాయిని లేపుకుపోయి గుడిలో పెళ్లి, ఎంఫీల్ మేడమ్ కు జైల్లో చిప్పకూడు, కన్నింగ్ లేడి !
చెన్నై/ తిరుచ్చి: 10వ తరగతి పాస్ అయిన అబ్బాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పదవ తరగతి చదివిన స్కూల్ లోనే ఇంటర్ రెండో సంవత్సరం వరకు కాలేజ్ ఉండటంతో అదే విద్యాసంస్థలో ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు. ప్రతిరోజు ఉత్సాహంగా కాలేజ్ కు వెలుతున్న యువకుడు అంతకంటే ఉత్సాహంగా ఇంటికి వెలుతున్నాడు. ఎప్పటిలాగే ఉదయం కాలేజ్ కు వెళ్లిన ఇంటర్ అబ్బాయి సాయంత్రం ఇంటికి వెళ్లలేదు. రాత్రి అయినా అబ్బాయి ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు అనేక ప్రాంతాల్లో గాలించారు.
చివరికి అబ్బాయి కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు విచారణ చేస్తున్న పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. అబ్బాయి చదువుతున్న స్కూల్ లో పని చేస్తున్న లేడీ టీచర్ కూడా మాయం అయ్యిందని వెలుగు చూసింది. లేడీ టీచర్ మొబైల్ నెంబర్ ట్రేస్ చెయ్యడంతో ఆమెతో పాటు ఇంటర్ అబ్బాయి పోలీసులకు చిక్కిపోయారు. మైనర్ అబ్బాయిని లేపుకుని వెళ్లిన లేడీ టీచర్ అతన్ని గుడిలో పెళ్లి కూడా చేసుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది. ఇంటర్ అబ్బాయిని పెళ్లి చేసుకున్న లేడీ టీచర్ ఎంఏ, బీఇడీ, ఎంఫీల్ కూడా పూర్తి చేసిందని తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు.

ఇంటర్ చదువుతున్న అబ్బాయి
తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలోని తురైయూర్ సమీపంలోని కొట్టయ్యూరు రోడ్డులో ఓ ప్రైవేట్ స్కూల్ అండ్ కాలేజ్ ఉంది. ఇదే స్కూల్ లో 10వ తరగతి పాస్ అయిన 17 ఏళ్ల అబ్బాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పదవ తరగతి చదివిన స్కూల్ లోనే ఇంటర్ రెండో సంవత్సరం వరకు కాలేజ్ ఉండటంతో అదే విద్యాసంస్థలో ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు.

స్కూల్ టీచర్
వయ్యావూర్ లో నివాసం ఉంటున్న తిలగవతి కుమార్తె షర్మిల (28) అనే యువతి ఎంఏ, బీఇడీ, ఎంఫీల్ పూర్తి చేసింది. అబ్బాయి ఇంటర్ చదువుతున్న స్కూల్ లో షర్మిల గత ఆరు సంవత్సరాల నుంచి టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. ఆ అబ్బాయి 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి షర్మిలకు పరిచయం ఉన్నాడని తెలిసింది.

కాలేజ్ కు వెళ్లి మాయం అయిన అబ్బాయి
ప్రతిరోజు ఉత్సాహంగా కాలేజ్ కు వెలుతున్న యువకుడు అంతకంటే ఉత్సాహంగా ఇంటికి వెలుతున్నాడు. ఎప్పటిలాగే ఉదయం కాలేజ్ కు వెళ్లిన ఇంటర్ అబ్బాయి సాయంత్రం ఇంటికి వెళ్లలేదు. రాత్రి అయినా అబ్బాయి ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు అనేక ప్రాంతాల్లో గాలించారు. చివరికి అబ్బాయి కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు.

స్కూల్ టీచర్ కూడా మాయం
కేసు విచారణ చేస్తున్న పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. అబ్బాయి చదువుతున్న స్కూల్ లో పని చేస్తున్న లేడీ టీచర్ షర్మిల కూడా మాయం అయ్యిందని వెలుగు చూసింది. లేడీ టీచర్ షర్మిలా మొబైల్ నెంబర్ ట్రేస్ చెయ్యడంతో ఆమెతో పాటు ఇంటర్ అబ్బాయి పోలీసులకు చిక్కిపోయారు.

మైనర్ ను గుడిలో పెళ్లి చేసుకున్న లేడీ టీచర్
మైనర్ అబ్బాయిని లేపుకుని వెళ్లిన లేడీ టీచర్ షర్మిల అతన్ని గుడిలో పెళ్లి కూడా చేసుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది. ఇంటర్ అబ్బాయిని పెళ్లి చేసుకున్న లేడీ టీచర్ షర్మిల ఎంఏ, బీఇడీ, ఎంఫీల్ కూడా పూర్తి చేసిందని తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు. ఇంటర్ అబ్బాయిని పెళ్లి చేసుకున్న షర్మిల మీద ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఆ అబ్బాయికి పాఠాలు చెప్పిన షర్మిలా చివరికి అతన్నే వివాహం చేసుకుందని పోలీసులు అన్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications