చనిపోయిన వ్యక్తి అకౌంట్లో ఇన్ని వందల కోట్లా..? బ్రతికుంటే నిజంగానే చనిపోయేది బాసూ..!!

ఆశ్చర్యం, సంభ్రమాశ్చర్యం.. షాక్, డీప్ షాక్... ఈ తరహా పదాలను, ఆ రకమైన అనుభూతిని ప్రతిఒక్కరు ఏదో ఒక సందర్భంలో పొందే ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే మాత్రం నోట మాట ఆగిపోయి.. కాసేపు బ్రెయిన్ పని చేయకపోవడం మాత్రం గ్యారంటీ.

బ్యాంక్ అకౌంట్ లోకి ఒక్కోసారి తెలియకుండా డబ్బులు డిపాజిట్ అయిన ఘటనల గురించి వింటూనే ఉంటాం. సాధారణంగా వేలల్లో, లక్షల్లో, కోట్లలో డబ్బు డిపాజిట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏకంగా చదవడానికే కష్టంగా.. చెప్పడానికి వీలుకానంత డబ్బు ఓ మహిళ అకౌంట్లో డిపాజిట్ అయ్యింది. అది కూడా ఒక చనిపోయిన మహిళ అకౌంట్ లోకి అంటే .. ఏం మాట్లాడుతున్నావ్ మామ.. నరాలు కట్ అయిపోతున్నాయని ఖచ్చితంగా అంటాం. ఇంతా చెప్తున్నారు అంటే అసలు ఆ అమౌంట్ ఎంత అని ఆలోచిస్తున్నారా.. అయితే మీరే చదివేయండి.. 1001356000000000000100235600000000299.

lakhs-of-crores-money-deposited-in-dead-women-account-at-uttar-pradesh-and-news-got-viral

ఎంత డిపాజిట్ అయ్యిందంటే..?

అవును అక్షరాలా 1001356000000000000100235600000000299 రూపాయలు చనిపోయిన ఓ మహిళ అకౌంట్లో డిపాజిట్ అయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో గత ఆదివారం నాడు చోటు చేసుకుంది. ఈ షాకింగ్ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఎక్కడ జరిగిందంటే..?

నోయిడా లోని దన్‌కౌర్ ప్రాంతానికి చెందిన గాయత్రి దీవీ అనే మహిళ.. రెండు నెలల మరణించింది. ప్రస్తుతం ఆమె ఫోన్‌ను కొడుకు దీపక్ ఉపయోగిస్తున్నారు. అయితే ఆదివారం రాత్రి ఆ ఫోన్ కి బ్యాంక్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. తన తల్లి అకౌంట్లోకి 1001356000000000000100235600000000299 డబ్బు డిపాజిట్ అయిందని ఆ మెసేజ్‌లో ఉంది. ఆ మెసేజ్ చూసిన అతడు షాక్ అయ్యి వెంటనే యూపీఐ యాప్ ఓపెన్ చేసి చూడగా.. నిజంగానే అంత డబ్బు అకౌంట్ లో కనిపించింది.

అకౌంట్ ఫ్రీజ్..

తొలుత ఆ నెంబర్లను లెక్కబెట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. వెంటనే తన ఫ్రెండ్స్‌కు మెసేజ్ పంపి ఆ మొత్తం ఎంతో అడిగగా.. ఆ సొమ్ము మొత్తం లక్షల కోట్లలో ఉంటుందని చెప్పడంతో.. సోమవారం నాడు బ్యాంకుకు వెళ్లి అసలు విషయాన్ని చెప్పడంతో.. సిబ్బంది అకౌంట్ చెక్ చేశారు. సదరు ఖాతాలో అంత డబ్బు ఉండడం చూసి అకౌంట్ ఫ్రీజ్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు సైతం సమాచారం అందించినట్టు వెల్లడించారు.

కాగా ఇన్‌కమ్ టాక్స్ అధికారులు సంబంధిత ఘటనపై విచారణ చేపట్టారు. ఇంత పెద్ద మొత్తం డబ్బు జమా కావడానికి టెక్నికల్ సమస్య లేదా మనీ ల్యాండరింగ్ అయ్యే అవకాశం ఉందా అని దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు దీపక్ తల్లి అకౌంట్ లోకి పెద్ద మొత్తంలో డబ్బులు పడ్డాయన్న విషయం బంధువులకు, గ్రామస్థులకు తెలియడంతో.. దీపక్‌కు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారట. పెద్దఎత్తున ఫోన్ కాల్స్ వస్తుండటంతో యువకుడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్టు సమాచారం. ఈ విషయం కాస్త మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చదవడానికి, చెప్పడానికే కష్టంగా మారినంత డబ్బు డిపాజిట్ అవ్వడం అంటే సాధారణ విషయం కాదని అవాక్కవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+