బెంగళూరులో లష్కర్ ఉగ్రవాది 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, ఏకే 47, స్యాటిలైట్ ఫోన్!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటకలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించి విధ్వంసం చెయ్యాలని ప్రయత్నించి అరెస్టు అయిన పాకిస్థాన్ నిషేదిత లష్కర్-ఏ-తోయిబా (ఎల్ఇటీ) ఉగ్రవాదికి ఏడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ. 50 వేలు జరిమానా విధిస్తూ బెంగళూరు న్యాయస్థానం తీర్పు చెప్పింది.

ఏకే 47, 200 బుల్లెట్లు

ఏకే 47, 200 బుల్లెట్లు

2007లో బెంగళూరులో బస్సు దిగి అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర ఏకే 47, 200 బుల్లెట్లు, ఐదు గ్రానైట్ లు, స్యాటిలైట్ ఫోన్, 38, 830 నగదు స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేశారు.

కర్ణాటక టార్గెట్

కర్ణాటక టార్గెట్

ఏక్ 47తో పాటు మారాణాయుధాలతో పట్టుబడిన వ్యక్తి పేరు బిలాల్ అహమ్మద్ ఖుటా అలియాస్ ఇమ్రాన్ జలాల్ అని పోలీసులు గుర్తించారు. 2001 నుంచి తాను ఎల్ఇటీకి పని చేస్తున్నానని, ఉగ్రవాదులకు నగదు సహాయం చేస్తున్నానని విచారణలో నిందితుడు అంగీకరించాడని పోలీసులు చెప్పారు.

ఎల్ఇటీతో సంబంధం

ఎల్ఇటీతో సంబంధం

స్యాటిలైట్ ఫోన్ లో పాకిస్థాన్ లో ఉన్న ఉగ్రవాదులతో తాను నిత్యం టచ్ లో ఉన్నానని నిందితుడు అంగీకరించాడు. కేసు విచారణ చేసిన పోలీసులు కోర్టులో ఎఫ్ఐఆర్ సమర్పించారు. 2009లో అమలు అయిన పీఎంఎల్ఏ చట్టం (మనీలాండరింగ్) కింద కేసు నమోదు అయ్యింది.

ఉగ్రవాది అని తేలింది

ఉగ్రవాది అని తేలింది

కోర్టు విచారణలో నిందితుడు కర్ణాటకలో విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నించాడని వెలుగు చూసింది. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని వారిని అంతం చేసి ఉగ్రవాదులకు సహకరిస్తున్నాడని వెలుగు చూసింది. మనీలాండరింగ్ కేసులో పీఎంఎల్ ఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివశంకర్ అమరణ్ణ నిందితుడికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 50 వేలు జరిమానా విధించారని పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A terrorist of the Pakistan-based terror group Lashkar-e-Taiba (LeT) has been sentenced to seven years rigorous imprisonment by a local court here in a terror financing and money laundering case,

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి