మాజీ ప్రధాని కొడుకు రాసలీలల వీడియో ఉంది, నోరు మూసుకుంటే మంచిది, లాయర్ చాలెంజ్ !
కర్ణాటక బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది దేవరాజ్‌గౌడ్ కర్ణాటక మాజీ మంత్రి, మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ కుమారుడు హెచ్ డీ రేవణ్ణ కుటుంబాల మధ్య రాజకీయ వైరుధ్యం తారాస్థాయికి చేరింది. కర్ణాటకలోని హాసన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించిన లాయర్ దేవరాజ్ గౌడ మాజీ మంత్రి రేవణ్ణ కుటుంబ సభ్యులకు చెందిన రాసలీలల వీడియో ఒకటి తన దగ్గర ఉందని, ఇక ముందు రేవణ్ణ నోరుమూసుకుని ఉంటే ఆయనకే మంచిదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి రేవణ్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ నేత, న్యాయవాది దేవరాజ్ గౌడ్ మరోసారి అన్నారు. హాసన్ లో మీడియాతో మాట్లాడిన న్యాయవాది, బీజేపీ నాయకుడు దేవరాజ్ గౌడ మాజీ మంత్రి రేవణ్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే హాసన్ నడిబోడ్డులోని మెయిన్ సర్కిల్‌లో ఎల్‌ఈడీ స్క్రీన్ పెట్టి వాళ్ల రాసలీలల వీడియో ప్రజలు అందరికి చూపిస్తానని హెచ్చరించారు.

బీజేపీ నేత, న్యాయవాది దేవరాజ్‌గౌడ్ ప్రకటనపై మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ మండిపడ్డారు. మాజీ మంత్రి రేవణ్ణ లాయర్ దేవరాజ్ గౌడకు ఓ సవాలు విసిరారు. మాజీ మంత్రి రేవణ్ణ మాట్లాడిన తరువాత ఆయన సవాలు, ఛాలెంజ్‌ని స్వీకరించేందుకు దేవరాజ్‌గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రేవణ్ణ ఛాలెంజ్‌ని సంతోషంగా స్వీకరించి రాష్ట్ర ప్రజల ముందు, దేశ పౌరుల ముందు ఓ వీడియో పెడతానని మాజీ మంత్రి రేవణ్ణను హెచ్చరించారు.
మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ సవాల్‌ని స్వీకరించానని, ఆయన సవాల్‌కు తగిన సమాధానం చెబుతానని అన్నారు. మాజీ మంత్రి రేవణ్ణ లాగా తాను ఎలాంటి బినామీ ఆస్తులు సంపాధించలేదని చెప్పారు. నేను నా ఆస్తి పత్రాలను మీ ఇంటికి కొరియర్ చేస్తానని, నాకు బినామీ భార్య లేదు, బినామి ఆస్తి లేదని, బినామి ఇల్లు కూడా లేదని, మీ ఇంటి చిరునామా సరిగ్గా ఇవ్వండి. పర్మినెంట్ అడ్రస్ చెబితే సేల్ డీడ్ లెటర్లను మీ ఇంటికి కొరియర్ చేస్తామనని మాజీ మంత్రి హెచ్ డీ. రేవణ్ణకు బీజేపీ నాయకుడు, లాయర్ దేవరాజ్ గౌడ సవాలు విసిరారు.












Click it and Unblock the Notifications